దర్శకుడు రాజమౌళి సామాన్యంగా వివాదాలకు అత్యంత దూరంలో ఉంటాడు. అంతేకాదు తన సినిమాలకు సంబంధించిన పబ్లిసిటీ వ్యవహారంలో మీడియా మిత్రుల సహకారాన్ని చాల వ్యూహాత్మకంగా అందుకుంటూ ఉంటాడు. ‘బాహుబలి’ విషయంలో రాజమౌళికి మీడియా అడగకుండానే ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోంది. అటువంటి మీడియా పై రాజమౌళి అసహనాన్ని వ్యక్తం చేయడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఈ శుక్రువారం 10వ తారీఖున విడుదల కాబోతున్న ‘బాహుబలి’ సినిమా విషయమై రాజమౌళి నిన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. రాజమౌళితో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, బాహుబలి నిర్మాత శోభు యార్ల గడ్డ, డివివి దానయ్య తదితరులు ప్రముఖులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నట్లుగా  తెలుస్తోంది. ఈ సమావేశంలో ‘బాహుబలి' పైరసీ కాకుండా అడ్డుకోవాలని రాజమౌళి, అల్లు అరవింద్ ప్రేక్షకులను విన్నవించుకుంటూ ఈ విషయంలో మీడియా సహకారాన్ని కూడ కోరాడు. 

అయితే ఈ సమావేశంలో పాల్గొన్న కొంతమంది మీడియా ప్రతినిధులు టిక్కెట్ల రేట్లు అధికంగా ఉండటం వల్లనే పైరసీ విస్తరిస్తోందంటూ మీడియా వారు తమ అభిప్రాయాన్ని రాజమౌళి వద్ద ఉంచారు. అయితే గతంలో టికెట్స్ రేటు తక్కువ ఉన్న రోజుల్లోనూ పైరసీ ఉంది కదా అని అంటూ రాజమౌళి మీడియా వారికి ఎదురు ప్రశ్న వేసేసరికి ఆ ప్రశ్నతో మీడియా ప్రతినిధులు కొంత హర్ట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. దీనితో ఆ మీడియా సమావేశంలో రాజమౌళికి మీడియా వారికి మధ్య కొంత గ్యాప్ ఏర్పడిన విషయాన్ని గ్రహించిన అల్లుఅరవింద్ కలగచేసుకుని ‘బాహుబలి’ సినిమాను ప్రజల వద్దకు తీసుకెళ్లేది మీడియా వారే అనవసరంగా ఒకరి పై ఒకరు ప్రశ్నలు ఎందుకు దయచేసి సహకరించండి అని అనడంతో మీడియా వారి కోపం కొంత వరకు తగ్గినట్లు తెలుస్తోంది. 

ఇదే సందర్భంలో మరికొందరు మీడియా ప్రతినిధులు ‘బాహుబలి’ కి సంబంధించిన ఇంటర్వ్యూలు కొన్నిపత్రికలకు మరికొన్ని ఛానల్స్ కు మాత్రమే ఇస్తూ మరికొందరిని దూరం పెడుతున్నారని అంటూ మీడియా వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ విషయాలను కూడ సరిదిద్దుతాం అంటూ మీడియా సమావేశాన్ని రాజమౌళి హడావిడిగా ముగించినట్లు ఫిలింనగర్ లో వార్తలు గుప్పుమంటున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: