తెలుగు చిత్ర సీమలో నందమూరి నటసింహ బాలకృష్ణ ఈ మద్య కాలంలో రికార్డుల మోత మోగిస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’ సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. ఇక లెజెండ్ సినిమా అయితే ఇప్పటికీ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఆయన సినిమా ‘లయన్’ కాస్త నిరాశ పరిచింది.. ఇప్పుడు బాలయ్య తీయబోయే సినిమా మరో సూపర్ డూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

బాలకృష్ణ డిక్టెటర్ చిత్ర యూనిట్ తో బోయపాటి శ్రీను, రాఘవేంద్రరావు


బాలకృష్ణ కొత్త చిత్రం ‘డిక్టేటర్’ ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు చేసి నెల దాటుంది కానీ రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు..అయితే దీనికి కారణం బాలకృష్ణ అంటున్నారు యూనిట్ సభ్యులు. వాస్తవానికి ఈ సినిమా కథ కోన వెంకట్  స్క్రిప్ట్ ను రాస్తున్నారు. అయితే కోన వెంకట్ స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిన తర్వాత కోన వెంకట్ కు మద్యలో స్క్రిప్ట్ ను మార్చే సెంటిమెంట్ ఉందట అయితే ఇది బాలయ్యకు ఏమాత్రం ఇష్టం లేదట అందుకే స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతే సెట్స్ పైకి వెళ్దాం అని చెప్పాడట. మరి  స్క్రిప్ట్ మొత్తం రెడీ అయితే ఈ నెల చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావచ్చు అని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: