ప్రజారాజ్యం కాంగ్రెస్ మహాసముద్రంలో కలిసిపోయిన తరువాత అనూహ్యంగా చిరంజీవి క్రేజ్ వెనకడుగు వేస్తే పవన్ కళ్యాణ్ క్రేజ్ రాకెట్ కన్నా స్పీడ్ గా అభిమానులలో పెరిగిపోయింది. దీనికి తోడు పవన్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంతో టాలీవుడ్ ఎంపరర్ అయ్యాడు పవన్. దీనితో పవనిజం ఒక మతంగా మారిపోయి యువతరాన్ని విశేషంగా ఆకర్షించింది.

ఈ నేపధ్యంలో గత సంవత్సరం 2014 ఎన్నికల ముందు పవన్ జనసేన పార్టీ పెట్టి రెండు సభలను ఎన్నికల ముందు నిర్వహిoచడంతో తాము ఎదురు చూస్తున్న నాయకుడు పవన్ రూపంలో వచ్చాడు అని పవన్ అభిమానులే కాకుండా సాధారణ ప్రజలు కూడ ఆనంద పడ్డారు. 

అయితే ఎన్నికల తరువాత ఏర్పడిన పరిస్థుతులలో పవన్ అటు రాజకీయంగా ఇటు సినిమాలలోను పూర్తి అజ్ఞాతవాసానికి పరిమితమై అప్పుడప్పుడు నేనున్నాను అంటూ ట్విట్ చేస్తూ తన ఉనికిని చాటుకుంటున్నాడు. ఈ నేపధ్యానికి కొనసాగింపుగా పవన్ నిన్న ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ ను పవన్ అభిమానులు కూడ పెద్దగా పట్టించుకోక పోవడమే కాకుండా పవన్ మాట్లాడిన విషయాల పై పవన్ అభిమానులు కూడా వెబ్ మీడియాలో ఎటువంటి చర్చలు జరపకపోవడంతో నిజంగానే పవర్ స్టార్ లో పవర్ పోయిందా అనే మాటలకు బలం చేకూరుస్తున్నాయి. 

ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ కొంతమంది పార్లమెంట్ సభ్యుల పేర్లను పేర్కొంటూ వారంతా తమ వ్యాపారాలకే పరిమతం అయిపోతున్నారు కాని సీమాంధ్ర ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదు అని చేసిన విమర్శల పై పవన్ పై ఎదురు దాడి చేయడానికి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు నిర్ణయించుకుని తమ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కై ఎదురు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలా ఆలోచించినా నిన్న జరిగిన ప్రెస్ మీట్ పవన్ కు ఎటువంటి మేలు చేయలేదు కదా కనీసo పవన్ వీరాభిమానులలో కూడ స్పందనను క్రియేట్ చేయలేకపోవడం ఆశ్చర్యకరం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: