ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తన అందాలతో యూత్ ను మత్తెక్కించిన భామ టబు.  వెంకటేష్ ‘కూలీ నెం.1 ’ సినిమాతో హాట్ హాట్ గా తన అందాల ప్రదర్శన చేసింది తర్వాత  ‘నిన్నే పెళ్లాడుతా’ ‘ఆవివా మా ఆవిడే’ సినిమాల్లో నాగార్జున సరసన నటించింది. తెలుగు లో మంచి ఆఫర్లు రాక పోవడంతో బాలీవుడ్ పయనమయ్యింది. తాజాగా మలయాళం నుండి బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న దృశ్యం చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది. 43 ఏళ్లు దాటిని ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా కుమారిగానే ఉంది. అజయ్ దేవ్ గన్ నటిస్తున్నదృష్యం హిందీ వర్షన్ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది ఈ క్యారెక్టర్ తెలుగులో నదియా చేసింది.

బాలీవుడ్ మూవి దృష్యం లో టబు, అజయ్ దేవగన్


చిత్రంలో టబు స్పెషల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. అజయ్ నాకు చిన్నప్పటి స్నేహితుడు అతనితో నాకు మంచి స్నేహ బంధం ఉంది. ఈ సినిమా కోసం అజయ్ నన్ను పోలీస్ క్యారెక్టర్ అడిగాడు ఆయన మాట కాదనలేక పోయాను. అంతే కాదు అజయ్ ఏం అడిగినా చేయడానికి నేను రెడీ అంటుంది ఈ ముదురు హాట్ భామ. గతంలో మేమిద్దరం కలిసి విజయ్ పథ్ చిత్రంలో నటించాం మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఈ చిత్రంలో నటిస్తున్నాం. అంతే కాదు సినిమాల్లో ఎక్కవగా నటించక పోయినా పార్టీల్లో కలుసుకుంటాం మా ఇద్దరి అల్లరి చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు అంటుంది టబు.


మరింత సమాచారం తెలుసుకోండి: