మన తెలుగు సినిమాలు కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందే రోజులు వచ్చాయని, ‘బాహుబలి’ ప్రపంచంలో ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఈ సినిమా టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో సినిమా నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిపై నిర్మాతల దగ్గర నుంచి టీ ఇచ్చే టీ బాయ్ వరకు సినిమా ఆధార పడి ఉంటారని కానీ పైరీసీ మూలంగా సినిమాలపై బాగా దెబ్బ పడుతున్నందని ఆవేదన వ్యక్తం చేశారు.

పైరసీ సీడీలు


ఆన్‌లైన్ పైరసీ వల్ల చిత్ర పరిశ్రమ ఎక్కువగా బాధపడుతోందని ఆయన అన్నారు. అయితే దీనికి సంబందించినవి, ఇప్పటికే 350 సర్వీస్ ప్రొవైడర్లకు పైరసీ సైట్ల వివరాలిచ్చామని తెలియజేశారు. అయితే ఈ పైరసీ ఎక్కువ థియేటర్లలోనే మొదలౌతుందని అక్కడ సరైన కట్టు దిట్టాలు లేక పోవడమో కొందరు వ్యక్తులతో కమిట్ మెంట్ కావడమో జరిగి థియేటర్లో సినిమాలు షూట్ చేసి పైరసీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. దీనికోసం పైరసీ నియంత్రణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. పైరసీకి పాల్పడిన థియేటర్ల పై ఏడాదిపాటు నిషేదం విధించనున్నట్లు ఆయన ఈ సందర్బంగా వెల్లడించారు. 


బాహుబలి పైరసీ ప్రెస్ మీట్ లో ‘బాహుబలి’ చిత్ర యూనిట్


ఈ సందర్భంగా బాహుబలి  దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ జులై 10న 'బాహుబలి' చిత్రం విడుదల అవుతుందని...కేవలం థియేటర్లలోనే చిత్రాన్ని చూడండని ప్రేక్షకులకు తెలిపారు. పెద్ద సినిమా, పెద్ద తెరపై చూడాల్సిన సినిమా బాహుబలి అని ఆయన అన్నారు. ఇది ఎన్నో వ్యయప్రయాసల కూర్చి చేసిన చిత్రం అందరు తెరపైనే చూడాలని రానా విజ్ఞ్యప్తి చేసారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: