రాజకీయాలలో రెండు పడవల సిద్ధాంతాన్ని తన అన్న చిరంజీవిలాగే అనుసరిస్తున్న పవన్ చిరంజీవిల మధ్య రకరకాల కారణాలతో దూరం ఏర్పడినా ఆ దూరాన్ని చిరంజీవి పవన్ ల నూతన వ్యూహం అన్నాదమ్ముల అనుబంధాన్ని మళ్ళీ చాల ఘాడంగా చిగురింప చేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి తన 150వ సినిమాగా నటిద్దాం అనుకుంటున్న సినిమాకు సంబంధించిన అన్ని లేటెస్ట్ విషయాలను తన తమ్ముడు పవన్ తో షేర్ చేసుకుంటూ అతడి సలహాలను తీసుకుంటున్నట్లు టాక్. పూరీజగన్నాథ్ చిరంజీవిల ‘ఆటో జానీ’ కి మొదలు కాకుండానే స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ రావడం వెనుక పవన్ సలహాలు ఉన్నట్లుగా వార్తలు గుప్పు మంటున్నాయి. 

అంతేకాదు పవన్ తనకు సన్నిహితులైన కొంతమంది రచయితలను చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి మంచి స్టోరీ లైన్స్ ను చెప్పమని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్యనే చిరంజీవి వినాయక్ ల మధ్య జరిగిన వ్యక్తిగత సమవేసంలోని విషయాలను కూడ చిరంజీవి పవన్ కు పూర్తిగా వివరించినట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో చిరంజీవి కామెంట్ చేసినట్లు తమ మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే అన్న మాటలను నూటికి నూరు పాళ్ళు నిజం చేస్తూ డైరెక్ట్ గా కాకపోయినా అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా పవన్ కాంపౌండ్ మెగా కాంపౌండ్ లు  తరుచు ఒకరికొకరు వారి అభిప్రాయాలను ఇచ్చి పుచ్చుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.  రాజకీయాలలో సంచలనం సృస్టించ లేకపోయిన ఈ అన్నదమ్ములు ఇద్దరు చిరంజీవి 150వ సినిమా విషయంలో ఎటువంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి..
  


మరింత సమాచారం తెలుసుకోండి: