యోగా బ్యూటీ అనుష్క ఇప్పటి వరకు ఎవరితోనూ ఏ సినిమాలోను చేయని విధంగా యంగ్ హీరోయిన్స్ తో పోటీ పడుతూ డీప్ లిప్ లాక్ లో మునిగిపోయింది అని వార్తలు వస్తున్నాయి. దేవసేనగా, రాణి రుద్రమగా రాజసంతో కూడిన పాత్రలలో నటించిన అనుష్క తన పద్ధతి మార్చి లిప్ లాక్ చేయడం నేటి హాట్ న్యూస్.

ప్రస్తుతం అనుష్క లేటెస్ట్ గా నటిస్తున్న ‘సైజ్ జీరో’ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో అనుష్క ఆర్యలపై కొన్ని రొమాంటిక్ సీన్స్ షూట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక డీప్ లిప్‌లాక్ అనుష్క ఆర్యల మధ్య షూట్ చేసినట్లు తెలుస్తోంది. 

గతంలో హీరో ఆర్య అనుష్కల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది అన్న వార్తాలు వచ్చాయి. అయితే ‘వర్ణ’ సినిమా తరువాత ఈప్రేమ జంట ఈసినిమాలో తిరిగి నటిస్తోంది. ఇప్పటికే
ఈసినిమా కోసం మరో 20 కిలోల పైగా బరువు పెరిగిన అనుష్క, ఇప్పుడు కొంత డీగ్లామర్ లుక్‌లో ఉన్నందువల్లనే ‘బాహుబలి’ ప్రమోషన్‌లో అనుష్క కనిపించడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి.

రాఘవేంద్రరావు కొడుకు కెఎస్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అతిగా లావు అయిన సమస్యతో బాధపడే అనుష్క తన లావును తగ్గించు కోవడానికి ఒక జిమ్ కు వెళుతూ ఉండటంతో ఆ జిమ్ లో కోచ్ గా పనిచేసే హీరో ఆర్య అనుష్కను ప్రేమించే వెరైటీ కథతో రూపొందిస్తున్న ఈసినిమాలో అనుష్క ఆర్యాతో చేసిన లిప్ లాక్ సీన్ ఈ సినిమా కథకు సంబంధించి చాల కీలకం అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా అనుష్క కూడ లిప్ లాక్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది..



మరింత సమాచారం తెలుసుకోండి: