రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన ‘బాహుబలి’ కౌంట్ డౌన్ మొదలైంది. జులై 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు  పెరిగిపోయాయి.  పైరసీ విషయంపై నిన్న ఓ ప్రెస్ మీట్ జరిగింది. ఈ మీడియా సమావేశంలో రాజమౌళి ‘బాహుబలి’ చిత్రం ఎంతో కష్టపడి తీసిన సినిమా అని, ఈ సినిమాను థియేటర్లో చూడండి.. ఎక్కడైనా పైరసీ అని మీకు తెలిస్తే చిత్ర యూనిట్ కు తెలియజేయండి అని విన్నవించారు. ఈ సందర్భంగా రాజమౌళిపై కొంత మంది ఫిలిం జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాహుబలి సినిమా ఇప్పటి వరకు ఇంత క్రేజ్ సంపాదించిందంటే ఆ క్రెడిట్ తమకు కూడా వస్తుందని...ఇంత కీలక షోషించిన మాకు ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  

ప్రెస్ మీట్ లో పాల్గొన్న బాహుబలి టీమ్, అల్లు అరవింద్


ఇటీవల కొంత మీడియా వాళ్లకు రాజమౌళి, బాహుబలి టీమ్  ప్రత్యేక ఇంటర్వూలు పిలిపించుకుని మరీ ఇచ్చారు. మీడియా జర్నలిస్ట్ లు మాకు ఎందుకు ఇంటర్వ్యూ లు ఇవ్వలేదు అని గట్టిగా నిలదీసారు. అయితే మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలకు జక్కన్న సమాధానం ఇవ్వకుండా విషయాన్ని పక్కదారి పట్టించాలని చూశారు కానీ  జర్నలిస్ట్ లు రెట్టించడంతో ముందుగా అనుకున్న వాటికి ఇచ్చామని సమాధానం దాటవేశారు దాంతో మీడియా వర్గం జక్కన్నపై ఆగ్రహం వ్యక్తం చేసారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: