ప్రతి విషయం పైనా తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ వెబ్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ కి కూడ ‘బాహుబలి’ ఫీవర్ తగిలింది. అనేక మంచి సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేసిన రాజమౌళి ‘బాహుబలి’ ని ప్రమోట్ చేసే బాధ్యత రేణు దేశాయ్ స్వీకరించింది. 

టాప్ హీరోల అభిమానులందరూ తమ తమ అభిమానాన్ని పక్కకు పెట్టి ‘బాహుబలి’ సినిమాను చూడండి అంటూ ట్విట్ చేయడమే కాకుండా ఇది భారతీయుల ఖ్యాతిని పెంచే గొప్ప సినిమా అంటూ ట్విట్ చేసింది. అంతేకాదు ఈ సినిమా మొదటిరోజు మొదటి ఆటను తాను తన కొడుకు అకిరాతో కలిసి పూణేలో చూడబోతున్న విషయాన్ని కూడ తెలియచేసింది. రేణు దేశాయ్ స్పందనకు 'బాహుబలి' టీమ్ కూడ ఉత్సాహంగా ధాంక్స్ తెలియచేసింది. 

ఈ వార్తలు ఇలా ఉండగా ‘బాహుబలి’ సినిమా మంచి విజయంసాధించాలని కోరుకుంటున్నా. ఈ స్థాయిలో ఓ తెలుగు సినిమాను చూడడం నిజంగా గర్వంగా ఉంది. బాహుబలి ఓ సినిమా కాదు అది తెలుగు సినిమాకే గర్వం. ప్రభాస్, రానాలు తమ కెరీర్లోనే అత్యున్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్నా. తెలుగు పరిశ్రమ స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అంటూ అల్లుఅర్జున్ కూడ నిన్న ట్విట్ చేసాడు. 

దీనిని బట్టి చూస్తూ ఉంటే మెగా కుటుంబం అంతా ఏకంగా ‘బాహుబలి’ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతున్నారా అని అనిపించడం సహజం. టాప్ హీరోల దగ్గర నుంచి సామాన్య ప్రేక్షకుల దృష్టి అంతా ‘బాహుబలి’ పై ఉన్నా ఎల్లుండి ప్రేక్షకుల నుండి ఎటువంటి తీర్పు రాబోతోంది అన్న టెన్షన్ లో మాత్రం రాజమౌళి కాలం గడుపుతున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: