బుల్లి తెరపై తన ముద్దు ముద్దు మాటలతో ‘కలర్స్ ’ ప్రోగ్రామ్ తో అందరి మనసు దోచేసిన  చిన్నది కలర్స్ స్వాతి.  ఈ అమ్మడు తెలుగు, తమిళ,మళియాళీ భాషల్లో బిజీ బిజీగా ఉంది అలాంటి స్వాతికి ఘోర పరాభవం జరిగింది. ఈ అమ్మడు తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న చిత్రం ‘త్రిపుర’. ఇప్పటికే స్వాతికి మంచి ఇమేజ్ ఉంది ఇది క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా చేస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చిందట స్వాతి.

త్రిపుర పోస్టర్


ఇక వెంటనే బాలీవుడ్ లోని నిర్మాతలను కలిసి తమ ప్రాజెక్టు గురించి చెప్పారట.. అక్కడ సినిమా పూర్తి చేసిన తర్వాత అది హిట్ అయితే ఇక్కడ రిమేక్ చేద్దాం అని చెప్పారట. అంతే కాదు తమకు ఆ స్వాతి అవసరం లేదు.. మరొక హీరోయిన్ ని తీసుకుంటామన కూడా చెప్పారట బాలీవుడ్ నిర్మాలు. దీంతో ఖంగు తిన్న స్వాతి తనను ఇంతలా అవమానిస్తారా అని తెగ బాధపడిపోయిందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: