తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ సినిమాకు రాని అద్భుతమైన క్రేజ్ ‘బాహుబలి’ సినిమాకు వచ్చిందని ఈ సినిమా ట్రైలర్స్ చూస్తుంటే ఓ కొత్త ప్రపంచం చూస్తున్నట్లు అనిపిస్తుందని అల్లు అర్జున్ అన్నారు. ఈ సినిమా రిలీజ్ గురించి సామాన్య ప్రేక్షకులే కాదు సెటబ్రెటీలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు బాహుబ‌లి గురించే చ‌ర్చించుకుంటున్నారు. ఈ సినిమాపై  స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు.

ప్రభాస్, అల్లు అర్జున్


ప్రభాస్, రానా తనకు మంచి మిత్రులని వారి కెరీర్ లో ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని అన్నాడు. అంతే కాదు ఈ సినిమా సూప‌ర్‌హిట్ అవ్వాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు బ‌న్ని సోష‌ల్‌మీడియాలో పేర్కొన్నాడు. తెలుగులో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చే సినిమాగా ‘బాహుబలి’ రికార్డుల మోత మోగించాలి అన్ని అన్నారు. ప్రభాస్, రానాలు ఈ సినిమాతో తమ కెరీర్లోనే ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకుంటార‌ని తాను ఆశిస్తున్న‌ట్టు బ‌న్ని చెప్పాడు. అలాగే తెలుగు పరిశ్రమ స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ బ‌న్ని ట్వీట్ చేశాడు.

అల్లు అర్జున్ ట్విట్స్

మరింత సమాచారం తెలుసుకోండి: