ఇండియాకి గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ తను. అలాగే ఇండియా గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ కూడ తనే. తనే ఆస్కార్ అవార్డులను కొట్టగొట్టిన మ్యూజిక్ మ్యాస్ట్రో ఏ.ఆర్.రెహమాన్. తన మ్యూజిక్‌ మ్యాజిక్‌ను హాలీవుడ్‌కు సైతం వ్యాపింపిజేసి ఆస్కార్ అవార్డు కొల్లగొట్టిన ఏ.ఆర్. రెహమాన్, ఇప్పుడు హాలీవుడ్ లోని ప్రముఖ సినీ వ్యక్తుల వద్ద నుండి కొద్దిగా ఇబ్బంది కరమైన ప్రశ్నలను వినాల్సివస్తుందట.

దీనికి కారణం కూడ ఓ ఇండియన్ సినిమానే అని ఇండియప్ ఫిల్మ్ మార్కెట్ లో తెలిసిన ఓపెన్ సీక్రెట్. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తాజా రెహమాన్ ‘బాహుబలి’సినిమాపై రెహమాన్ ప్రశంసల వర్షం కురిపించారు. “లైఫ్ ఆఫ్ పై తర్వాత నన్ను ఆ స్థాయిలో ఆకర్షించి థియేటర్‌కు రప్పించిన సినిమా ఇండియన్ మాస్టర్‌పీస్ ‘బాహుబలి’. సినిమా చూశాక మంచి అనుభూతి కలిగింది. ఇక మనం ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయగలం అనే నమ్మకాన్ని బాహుబలి కల్పించింది”అంటూ బాహుబలి సినిమాపై రహమాన్ ప్రశంసలు కురిపించారు.

ఈ ప్రశంసలు వెనుక ఉన్న అస్సలు కారణం బయటపడింది. ప్రపంచ వ్యాప్తంగా, బాహుబలి ప్రపంభజనం కొనసాగుతుంటే, ఈ మూవీకి మ్యూజిక్ అందించిన డైరెక్టర్ కచ్ఛితంగా రెహమాన్ అయి ఉంటాడని కొందరు హాలీవుడ్ పండిట్స్, బాహుబలి సినిమాలోని టైటిల్స్ ని చూడకుండా రెహమాన్ కి కంగ్రాట్స్ చెప్పారంట. అయితు తరువాత రెహమాన్ తను కాదని చెప్పటం, వారు ఎవరని అడిగి తెలుసుకోవడం తనకి ఇబ్బంది మారాయంట.

ఇక అమెరికాలోని రెహమాన్ ఫ్యాన్స్ అయితే, బాహుబలి మూవీ ప్రాజెక్ట్ కి ఎందుకు మీరు మ్యూజిక్ ని అందించలేకపోయారు? అంటూ డైరెక్ట్ గానే అడుగుతున్నారంట. దీంతో విసిగిపోయిన రెహమాన్, బాహుబలి డైరెక్టర్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ లను తన సోషియల్ నెట్ వర్కింగ్ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని తన మేసేజ్ ద్వార ఆ ఇద్దరి వివరాలను ముఖ్యంగా చెప్పుకొచ్చాడని బిటౌన్ లో కథనాలు వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: