దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ‘రుద్రమదేవి’. కాకతీయుల వంశ చరిత్రను దశ దిశలా చాటి చెప్పి ఖ్యాతి గాంచిన రాణి రుద్రమదేవి ఇతిహాసాన్ని అనుష్క మెయిన్ హీరోయిన్ గా రాణిరుద్రమదేవి  చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం కోసం గుణశేఖర్ ఎన్నో కష్టాలు పడ్డాడు. భారీ సెట్టింగులతో అత్యద్భుతమైన గ్రాఫిక్స్ వ్యూజువలైజేషన్స్ తో సినిమాను 3D ఎఫెక్ట్ తో తీశారు. ఇప్పటి వరక చారిత్రక సినిమాలు ఎన్నో వచ్చాయి కానీ ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదని చిత్ర యూనిట్ తెలిపింది.

రుద్రమదేవి పోస్టర్


ఇక సినిమాలో మరో హైలెట్ గోన గన్నారెడ్డి ఈయన తెలంగాణ వీరుడు. ధనికులను కొల్లగొట్టి పేదవారికి పంచి పెట్టే గుణం కలిగిన వాడు. ఈ పాత్రంకు సరిగ్గా సరిపోతాడని  అల్లు అర్జున్ ని సంప్రదించాడట గుణశేఖర్ కథ విని పాత్ర నచ్చి వెంటనే ఒప్పేసుకున్నాడట బన్ని.  అయితే గోనగన్నారెడ్డి పాత్రకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ సినిమాలో కొద్దిసేపే ఉండవచ్చు అని అనుకున్నారు కానీ ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో దర్శకులు చెప్పిన దాని ప్రకారం గంటసేపు ఉంటుందట అల్లు అర్జున్ పాత్ర.

ఏ పాత్రలయినా కొద్దిగా నిడివి ఉంటే అవి ఎక్కువ గుర్తింపునకు రావు.. అందుకే ఈ సినిమాలో అల్లు అర్జున్ ప్రాత కు అంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. దాంతో బన్నీ అభిమానులు ఫుల్లుగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని తెలుస్తోంది గోనగన్నారెడ్డి పాత్ర . ఇప్పటికే బన్నీ పలికిన డైలాగ్ ''తెలుగు భాష లెక్క నేను ఈడా ఉంటా ఆడా ఉంటా '' అనేది బాగా పాపులర్ అయ్యింది .


మరింత సమాచారం తెలుసుకోండి: