దశాబ్ధాల చరిత్ర కలిగిన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని, నలుదిశలా, నలుమూలల పేరును ప్రసరించేలా చేసిన మూవీ బాహుబలి. నిజంగా బాహుబలి మూవీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచింది నేడు. మరో పది సంవత్సరాల తర్వాత జరగాల్సిన అద్భుతం, ఇంత వేగంగా జరగటం నిజంగా ప్రతి ఒక్కరినీ ఆశ్ఛర్యానికి గురిచేసింది. టాలీవుడ్ సినిమా సత్తా ఏంటో చాటిన సినిమా బాహుబలి.

అయితే టాలీవుడ్ కి బాహుబలి లాంటి సినిమాలు ఎప్పుడో పుష్కరాలకి ఒకసారి వస్తే, బాలీవుడ్ లో మాత్రం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. ఇక నుండైనా కథల విషయంలో విప్లవాత్మకమైన మార్పులతోనూ, ఎక్స్ పరిమెంట్స్ తోనూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుకు వెళితే, కచ్ఛితంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా రంగం తిరుగులేని విజయాలను నమోదు చేసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి తన తండ్రికి కన్నీళ్ళతో సమాధానం చెప్పినట్టుగా టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినబడుతున్న పేరు విజయేంద్ర ప్రసాద్. బాహుబలి, భజరంగీ భాయ్ జాన్ ల సినిమాలకు కధను అందించి యమ పాపులర్ అయిపోయాడు. ఈ రెండు సినిమాలు ఇండియా లెవల్లోనే అత్యుత్తమ బిజినెస్ చేయడంతో ఫోర్బ్స్ వంటి ప్రధాన పత్రిక సైతం ఈయనపై ఒక కవర్ స్టోరీని డిజైన్ చేసింది. 

72ఏళ్ళ వయసులో విజయేంద్ర ప్రసాద్ క్రియేటివ్ థింకింగ్ ని, కధా రచనా శైలిని ఈ పత్రిక కొనియాడింది. అంతేకాక ఈ రెండు కధలకు ఎంతో వ్యత్యాసం వుండడం కూడా గమనార్హం. తన కథలను చాలా గొప్పగా చిత్రీకరించి, తనకు పేరు తీసుకువచ్చినందుకూ, అలా చేసిందీ తన కొడుకే అయినందుకు రాజమౌళికి.. తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడంట. అయితే అందుకు రాజమౌళి భావోధ్వేగంతో, ఆనందబాష్పాలను రాల్చుతూ.. ఇది మన విజయం..మీరు నేర్పిన విద్య అంటూ చెప్పుకొచ్చాడంట. తండ్రికి 72 ఏళ్ళ వయస్సులో వచ్చిన ప్రపంచ గుర్తింపుకి రాజమౌళి ఆనందానికి హద్ధులు లేకుండా పోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: