ఓ మూవీ ఎన్నో ఇబ్బందులను ఎదొర్కొని షూటింగ్ ని ముగించుకొని, పబ్లిసిటీ కోసం ఆడియో ఫంక్షన్స్ ని పెట్టుకుంటే, ఆ ఆడియో ఫంక్షన్ కాస్త, రచ్ఛ రచ్ఛగా మారితే ఎలా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆడియో ఫంక్షన్స్ కి హీరోయిన్స్ తప్పతాగి వస్తే.. అటు వంటి సమయాల్లో హీరోయిన్స్ కి కంట్రోల్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఫంక్షన్ లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే ఎవరికైనా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది.

అయితే చాలా తక్కువ సందర్బాల్లో ఈ తరహా న్యూసెన్స్ లు జరుగుతుయి. ముఖ్యంగా బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటువంటి సందర్భాలు జరిగాయి. వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ప్రియాంక చోప్ర ఫిల్మ్ కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో ఓ మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ కి తను మత్తుగా వచ్చినట్లు ఫంక్షన్ నిర్వాహకులు గమనించారంట. ఇక ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతలకి, దర్శకుడుకి తెలియజేశారు.

వెంటనే దర్శకుడు ఆమెని స్వయంగా తనే స్టేజ్ పైకి పిలిచి, తనతో సరదాగా రెండు మాటలు మాట్లాడించి.. ఆ బ్యూటీని అక్కడి నుండి పంపించి వేయటంతో ఫంక్షన్ ప్రశాంతంగా జరిగిపోయింది. అలాగో మరో స్టార్ హీరోయిన్ ఆడియో ఫంక్షన్ కి తాగొచ్చి, ఫంక్షన్ నిర్వాకులపై, తనకు సెక్యూరిటీ గా నియమించిన బౌన్సర్స్ పై విరుచుకుపడిందట. ఆమె హంగామాకి బెదిరిన బౌన్సర్స్ కి...తనని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళి వదిలి వచ్చారంట.

అయితే ఇంతలా వీరంగం చేసిన నటీమని మల్లికా శెరావత్ అంటూ అప్పట్లో న్యూస్ వచ్చినా, తను అలాంటివి ఎప్పుడూ చేయలేదని ఒక్క తరువాత రోజు ఒక్కమాటతో తేల్చిపారేసింది. తాజాగా హిందీ పాపులర్ మ్యాగజైన్ ఈ మత్తు హీరోయిన్స్ పై స్పెషల్ ఫోకస్ రావడంతో ఈ విషయాలు బయటపడ్డాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: