ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ నిన్న రాత్రి ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఇంటిపేరు వదులుకున్న అసలు రహస్యాన్ని బయట పెట్టాడు. ‘బాహుబలి’ సినిమా గురించి తమ కుటుంబ నేపధ్యం గురించి ఎన్నో ఆశక్తికర విషయాలను విజయేంద్ర ప్రసాద్ ఈఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. తమ ఇంటిపేరు ‘కోడూరి’ అయినా కీరవాణి రాజమౌళి పేర్లు ముందు కోడూరి కాకుండా యం.యం, ఎస్.ఎస్. అనే పేర్లు ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయని కొన్ని వ్యక్తిగత కారణాలు వల్ల తాము తమ ఇంటి పేరు ‘కోడూరి’ ని వదిలేసాము అనే విషయాన్ని తెలియచేసాడు విజయేంద్ర ప్రసాద్. 

శ్రీలేఖ వాళ్ల తండ్రి స్పిరిచువల్‌ గురువు కావడంతో ఆయన ఆలోచించి ఈ పేర్లను కీరవాణి రాజమౌళి లకు ఇంటి పేర్లగా మార్చారని అసలు విషయాన్ని బయట పెట్టాడు ఈ విజయేంద్రుడు. ఇదే సందర్భంలో తనను ఇంతగా ప్రభావితం చేసిన వ్యక్తి పేరు కూడ బయట పెట్టాడు విజయేంద్ర ప్రసాద్. వైజాగ్ లో ఉంటున్న బిఎస్ ప్రసాద్ వ్యక్తిత్వం తన పై అపరిమితంగా ప్రభావాన్ని చూపెట్టిందని ఆ వ్యక్తి తరువాత తన కొడుకు రాజమౌళి వ్యక్తిత్వం తన పై అపారమైన ప్రభావాన్ని చూపెట్టిందని వీరిద్దరి ప్రభావంతోనే తాను 72 ఏళ్ల వయస్సులో కూడ కథలు వ్రాయగలుగుతున్నాను అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు ఈ ‘బాహుబలి’ రచయిత. 

జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వ్యక్తిగా తాను నేటి తరానికి చెప్పే సందేశం ఏదైనా ఉంటే బీ సిన్సియర్‌ టు యువర్‌సెల్ఫ్‌ హానె్‌స్టగా ఉండండి, ఏ వ్యక్తి అంతరాత్మ చెప్పినట్టు నడుచుకోలేడు, కానీ కొంతవరకైనా ప్రయత్నం చేస్తే చాలు అంటూ తన జీవిత అనుభవాలను విజయేంద్ర ప్రసాద్ నేటి తరానికి అందించే ప్రయత్నం చేసాడు. తన కొడుకు రాజమౌళి గురించి మాట్లాడుతూ రచయిత చెప్పిన కథ చెప్పింది చెప్పినట్లుగా దృశ్యకావ్యంలా తెరకెక్కిస్తాడు కాబట్టే రాజమౌళికి ఇంత పేరు వచ్చింది అని కామెంట్ చేసాడు. 

అందమైన అబద్ధాలను నిజాలుగా తెరకెక్కించి చూపించగల వాడు మాత్రమే సినిమా రంగంలో చరిత్ర సృస్టించ గలుగుతారు అని అంటూ తన జీవితంలో ఎప్పటికైనా తన కొడుకు చేత ‘మహాభారతం’ కథను సినిమాగా భారీ గ్రాఫిక్స్ తో తీయించి, తాను మాత్రం ‘తెలంగాణ చరిత్ర’ ను సినిమాగా తీయాలన్న కోరికతోనే తాను భవిష్యత్ గురించి కలలు కంటున్నాను అంటూ తనకు ఇప్పటి వరకు తీరని కోరికలను బయట పెట్టాడు విజయేంద్ర ప్రసాద్..


మరింత సమాచారం తెలుసుకోండి: