మెగా యంగ్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ తన కెరియర్ ఎదుగుదల కోసం చిరంజీవి పవన్ ల ఇమేజ్ ను ఎంతవరకు వాడుకోగలడో అంతవరకూ ఉపయోగించుకుంటూ మెగా కుటుంబ వారసత్వాన్ని కొనసాగించే హీరోల లిస్టులో శాశ్విత స్థానం పొందడానికి తన వంతు ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నాడు. 

ఇప్పటికే రెండు సినిమాలు నటించి నటుడిగా తనకంటూ ఒక గుర్తింపును మెగా అభిమానులలో ఏర్పరుచుకున్న సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాకు సంబంధించి ఒక ఆ శక్తికర న్యూస్ ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమా కథ గతంలో చిరంజీవి నటించిన ఒక సినిమా కథకు ఇంచుమించు కాపీ అండ్ పేస్ట్ లా అనిపిస్తుంది అన్న వార్తలు వస్తున్నాయి. 

చిరంజీవి మెగా హీరో కాకముందు నటించిన సినిమాలలో ‘మొగుడు కావాలి’ సినిమా 1980 ముందు ప్రాంతాలలో బాగా హిట్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఆరోజులలో ప్రముఖ దర్శకుడిగా పేరుగాంచిన కట్టా సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన అలనాటి సినిమా అప్పట్లో యూత్ ను బాగా ఆకర్షించింది. ఆ సినిమాలో హీరోయిన్ తన తండ్రి చనిపోయాక ఆ ఆస్తిని పొందాలి అంటే పెళ్ళి చేసుకుని తీరాలి అన్న కండిషన్ తో వీలునామా ఉండటంతో అద్దె మొగుడుగా చిరంజీవిని వెతికి పట్టుకుని తన ఆస్థిని స్వాధీనం చేసుకోవడానికి హీరోయిన్ ప్రయత్నిస్తుంది. 

ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కథలో కూడ హీరోగా నటిస్తున్న సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ రెజీనాకు అద్దె మొగుడుగా కనిపిస్తాడని టాక్. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాకు సంబంధించి ప్రధాన కథను గతంలో వచ్చిన ‘మొగుడు కావాలి’ సినిమాను గుర్తుకు చేసే విధంగా తయారు చేసాడని అదేవిధంగా కొన్ని సీన్స్ చిత్రీకరణ కూడ ‘మొగుడు కావాలి’ సినిమా లాగే కనిపిస్తాయని ఫిలిం నగర్ టాక్. ఈ నేపధ్యంలో ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం వచ్చిన చిరంజీవి సినిమాను కాపీ కొట్టి తీయవలసిన పరిస్థితి హరీష్ శంకర్ కు ఎందుకు ఏర్పడింది అంటూ సెటైర్లు పడుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: