తెలుగు ఇండస్ట్రీలో వంశి దర్శకత్వంలో ఆర్యన్ రాజేష్ సరసన ‘అనుమానాస్పదం’ సినిమాతో తన అందాలు ఆరబోసి కుర్రకారుకి పిచ్చెక్కించిన హీరోయిన్ హంసనందిని. పూనేలో జన్మించిన ఈ అమ్మడ తర్వాత ముంబాయిలో మోడలింగ్ చేస్తూ ఒక ఆడిషన్ లో వంశి కంట్లో పడింది. వెంటనే తన సినిమాలో సినిమాలో చాన్సు ఇచ్చాడు. వాస్తవానికి ఈ సినిమా పెద్ద హిట్ కాకపోయినా హంస నందిని అందాలు చూసి ఫ్లాట్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. తర్వాత హీరోయిన్ గా చాన్సులు ఎక్కువ రాలేదు కానీ ఐటమ్ సాంగ్స్ బాగా వచ్చాయి.

అత్తారింటికి దారేది, మిర్చి సినిమాలో ఐటమ్ సాంగ్స్ కి బాగా పేరొచ్చింది. తర్వాత దర్శక, నిర్మాత గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ‘రుద్రమదేవి’. కాకతీయుల శౌర్యాన్ని చాటి చెప్పిన రాణి రుద్రమదేవి చరిత్ర ప్రధానాంశంగా అందాల తార అనుష్క ముఖ్య భూమికగా పోషించిన చిత్రం రుద్రమదేవి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గుణా టీం వర్క్స్ బ్యానర్ పై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణశేఖర్ స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఇళయరాజా సంగీతం అందించారు.  

రుద్రమదేవి చిత్రంలో హంస నందిని


‘రుద్రమదేవి’ చిత్రంలో హంస నందిని ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది.  వాస్తవానికి మే నెలలోనే విడుదల కావాల్సి ఉన్నా కొన్ని గ్రాఫిక్స్ వర్క్స్ కారణంగా పోస్టు పోన్ అవుతూ వచ్చింది.  ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ వర్క్ మొదలు పెట్టారు.

రుద్రమదేవి పాత్రలో అనుష్క, గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించారు. ఇక రానా, కృష్ణంరాజు, ప్రకాశ్ రాజ్, నిత్యామీనన్, కెథరిన్, హంసా నందిని, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. అయితే వీటి తాలుకు ఫస్ట్ లుక్ సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. తాజాగా  హంసా నందిని నటించిన ‘మదనిక’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో హంసనందిని రాజకుమారిలా చాలా అందంగా కనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: