రామ్ చరణ్ - శ్రీనువైట్ల కాంబినేషన్ లో నిర్మించ బడుతున్న సినిమాకు ‘బ్రూస్ లీ’ అన్న టైటిల్ పెడతారు అన్న ప్రచారం జరిగింది. ఈ టైటిల్ విషయమై మెగా కాంపౌండ్ లో చర్చలు కూడ జరుగుతున్నాయి అన్న వార్తలు వచ్చాయి. 

అయితే మెగా కపౌండ్ కు షాక్ ఇస్తూ ఈ టైటిల్ ను ఒక కోలీవుడ్ సంగీత దర్శకుడు కబ్జా చేయడమే కాకుండా ఆ టైటిల్ తో తన సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. కోలీవుడ్ లో మంచి సంగీత దర్శకుడిగా పేరు గాంచిన జి.వి.ప్రకాష్ కుమార్ తాను ప్రశాంత్ పాండ్యరాజ్ దర్శత్వంలో నటించబోయే సినిమాకు 'బ్రూస్ లీ' అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసాడు.

యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈసినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. అంతలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసి రామ్ చరణ్ కు షాక్ ఇచ్చాడు  జి.వి.ప్రకాశ్‌. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది అని టాక్. ప్రస్తుతం ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘త్రిష ఇల్లానా నయనతార’ ఆగస్టు రెండో వారంలో రిలీజ్ కాబోతుంది. 

ఈ వార్తలు ఇలా ఉండగా రామ్ చరణ్ ఫైటర్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమాలో చిరంజీవి అతిధిగా హీరో పాత్రలో నటించే విషయమై తీవ్ర స్థాయిలో మెగా కాంపౌండ్ ఆలోచనలు చేస్తోంది. ఈ విషయమై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే నెలలో రాబోతున్న చిరంజీవి షష్టిపూర్తి వేడుకల సమయానికి రావచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: