దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం, అన్ని చోట్ల నుండి ఘనమైన విజయాలను అందుకుంటుంది. అయితే తాజాగా బాక్సాపీస్ ట్రేడ్స్ అందించిన లెక్కల ప్రకారం.. ఈ మూవీ 400 కోట్ల మార్క్ ని టచ్ చేసిందనే లెక్కలు వినిపించాయి. అయితే ఈ రికార్డ్ ని పక్కన పెడితే ఒక తెలుగు మూవీకి హిందీలో ఎన్నడూ రానంతగా, అలాగే ఎనాడూ ఊహించనంతగా కలెక్షన్స్ వస్తున్నాయి.

దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తెలుగు, తమిళ, హిందీ, మళయాలం ఇలా అన్ని భాషల్లో జూలై10న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా మూడో వారం, బాక్సాపీస్ వద్ద ప్రభంజనాన్ని చాటుతుంది.  తమిళం, హిందీల్లో పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పటికీ, బాహుబలి ఊపు ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఏడాది తమిళంలో విడుదలైన సినిమాల్లో చెన్నై నగరంలో బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ స్థానంలో శంకర్ ‘ఐ’సినిమా నిలిచింది.

ఈ సినిమా లాంగ్ రన్‌లో 8 కోట్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో ఇప్పటి వరకూ బాహుబలి మూవీ 85 కోట్ల రూపాయల కలెక్షన్స్  కొల్లగొట్టింది. లాంగ్ రన్ ఈ మూవీ సైతం 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టటం ఖాయం అని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఒక తెలుగు డబ్బింగ్ మూవీకి బిటౌన్ వంద కోట్ల రూపాయల కలెక్షన్స్ అనేది సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. నిజంగా ఈ ఫీట్ ని సాధిస్తున్న బాహుబలి మూవీ, ఓ అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసి.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇండియాలో అగ్రస్థానాన నిలబెట్టుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: