‘బాహుబలి’ సూపర్ సక్సస్ తో సూపర్ జోష్ పై ఉన్న విజయేంద్రప్రసాద్ ఈమధ్య ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వారికి తీవ్ర కోపాన్ని తెప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆంధ్రా ప్రాంతంలోని ప్రజలు తమ ఇంటికి వచ్చిన అతిధులకు వారి ఆర్ధిక స్థాయిని బట్టి అతిథి మర్యాదలు చేస్తూ ఉంటారని కామెంట్ చేసాడు. 

అంతేకాదు తమ ఇంటికి వచ్చిన అతిథి సామాజిక స్థాయి అతడి కుటుంబ నేపధ్యం బట్టి అతడికి ఇచ్చే అతిథి మర్యాదలు మారిపోతూ ఉంటాయని అయితే తెలంగాణ ప్రాంతంలోని వారు అయితే తమ ఇంటికి వచ్చిన అతిధుల స్థాయి గురించి పట్టించుకోకుండా వారికి అతిథి మర్యాదలు చేస్తారని కామెంట్ చేసాడు విజయేంద్రప్రసాద్. అయితే కోస్తా ప్రాంతంలోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతానికి చెందిన ఈ ‘బాహుబలి’ సృష్టికర్త ఇలా ఎందుకు కామెంట్ చేసాడు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఫిలింనగర్ లో వినిపిస్తున్న విశ్లేషణల ప్రకారం విజయేంద్రప్రసాద్ తన కెరియర్ లో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నప్పుడు కోస్తా ప్రాంతం వారు తనను సరిగ్గా గుర్తించలేదు అన్న కోపంతో ఈ కామెంట్ చేసాడా? లేదంటే ఎప్పుడో కోస్తా ప్రాంతం నుండి తన మకాం చెన్నైకి మార్చివేయడంతో కోస్తా ప్రాంతం పై తన అభిమానం సన్నగిల్లి పోయి ఇలా కామెంట్ చేసాడా అంటూ అప్పుడే కొంతమంది రంద్రాన్వేషణ ప్రారంభించారు.

అయితే అతిథి మర్యాదలకు చిరునామాగా కోస్తా ప్రాంత ప్రజలు ఉంటారు అన్న విషయం అందరూ అంగీకరించే మాట. అయితే ఈమధ్యనే ముగిసిన గోదావరి పుష్కరాల సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు కోట్లాది సంఖ్యలో వచ్చిన పుష్కర యాత్రికుల కోసం మంచినీళ్ళ ప్యాకేట్లనుండి భోజన సదుపాయాల వరకు కోట్లాదిమందికి చేసిన అతిథి మర్యాదలు విజయేంద్రుడి దృష్టికి రాలేదా అనే మాటలు కూడ వినిపిస్తున్నాయి. ఎదిఎమైనా విజయేంద్రప్రసాద్ ఈ వ్యాఖ్యలు ఏ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని చేసాడు అన్న విషయం పై క్లారిటీ లేదు..


మరింత సమాచారం తెలుసుకోండి: