కాసింత కలెక్షన్లు గ్యారంటీగా వస్తాయని అనిపిస్తే చాలు.. ఎలాంటి చిత్రమైనా చేసేయడానికి ఉబలాటపడేవాళ్లు సినీ ఇండస్ట్రీలో చాలా మందే ఉంటారు. నైతిక విలువలు, సినిమా ఎంత దుర్మార్గంగా ఉన్నది.. లాంటి అంశాలు వేటితోనూ వారికి నిమిత్తం ఉండదు. డబ్బులు సంపాదించడం ఒక్కటే వారికి కావాల్సింది. మామూలు సినిమాలోనే.. జనరంజకంగా కాస్తంత రొమాన్సును, శృంగారాన్ని కలపడం ఒక ఎత్తు. అయితే.. ఏ సర్టిఫికెట్‌ సినిమానే తీయాలనే కోరికతో సదరు శృంగారాన్ని కాస్త శృతిమించేలా చేయడం కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ.. పచ్చి బ్లూఫిలింనే గుర్తు చేసే చిత్రాల్ని ఎగబడి డబ్బింగ్‌ చేసి తెలుగుప్రేక్షకులకు అందించడానికి చేసే ప్రయత్నాల్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అదే జరుగుతోంది. రెండేళ్ల కిందట బాలీవుడ్‌లో వచ్చిన బూతుసినిమా ''బీఏ పాస్‌''ను అదే టైటిల్‌తో తెలుగులో అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. 


హిందీలో ఈ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో అజయ్‌ బెహల్‌ నిర్మించారు. 'రైల్వే ఆంటీ' అనే ఒక చిన్నకథ ఆధారంగా ఈ సినిమ స్క్రిప్టును తయారుచేసుకున్నారు. శిల్పాశుక్లా, షాదాబ్‌ కమల్‌లు ప్రధాన పాత్రల్లో చేశారు. ఈ చిత్రం కథ ఏంటంటే.. తల్లిదండ్రులను కోల్పోయి బంధువుల పంచన చేరిన ఓ కుర్రాడు డిగ్రీ బీఏలో జాయిన్‌ అయి.. చిల్లర ఖర్చుల కోసం ఒక వివాహిత ఉచ్చులో ఇరుక్కుంటాడు. ఆమె అతణ్ని తన సెక్స్‌ అవసరాలకోసం విచ్చలవిడిగా వాడుకుంటూ ఉంటుంది. తన సర్కిల్‌లోని అలాంటి అనేక మంది వివాహితలకు అతణ్ని పరిచయం చేస్తుంది. అందరూ అతణ్ని వాడుకుని డబ్బు ఇస్తూ ఉంటారు. అతనో గిగోలో (మగ వ్యభిచారి)లా మారుతాడు. కొన్నాళ్లకు ఒక సంబంధం బయటపడేసరికి అసలు అతడిని వాడుకున్న వారంతా దూరం పెడతారు. బంధువులు కూడా ఇంటినుంచి తరిమేస్తారు. అతడు గతిలేని పరిస్థితిలో.. మగాళ్లకే సెక్స్‌ కోరికలు తీర్చే హోమో సెక్సువల్‌గా మారుతాడు. ఈలోగా అనాథల హోంలో ఉన్న అతడి ఇద్దరి చెల్లెళ్ల జీవితం కంగాళీ అయిపోతుంటుంది. చివరికి అతను ఆత్మహత్య చేసుకోవడంతో కథ ముగుస్తుంది. 


చిత్రం పొడవునా పచ్చి బూతు సన్నివేశాలే ఉంటాయి. ఇలాంటి బూతు చిత్రాన్ని రెండేళ్ల తర్వాత.. తెలుగులోకి తీసుకురావాలనే ఆలోచన నిర్మాతలకు ఎందుకు వచ్చిందో గానీ.. డబ్బింగ్‌ చేయబోతున్నారట. ఇటీవలి కాలంలో తెలుగులో ఏదో కక్కుర్తి నిర్మాతలంతా హరర్‌ జోనర్‌తోనే సరిపెట్టుకుంటుండగా.. మళ్లీ సెక్స్‌ జోనర్‌ చిత్రాలు రాబోతున్నాయన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: