రాజమౌళి.. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు. సునీల్ తో బంపర్ హిట్ కొట్టినా.. ఈగని హీరో చేసిన సినిమా సూపర్ సక్సస్ చేసినా అది దర్శక ధీరుడికే చెల్లింది. తాను మనసులో అనుకున్న కథను యథాతథంగా తెరపై ఆవిష్కరించేందుకు ఎంత కష్టానికైనా వెనుదీయని కష్టశిల్పి జక్కన్న. 

బాహుబలి సినిమాతో అది రుజువైపోయింది. ఓ సినిమా కోసం దాదాపు ఆరేళ్ల క్రితమే మేథో మథనం ప్రారంభించి.. దాదాపు 3 ఏళ్లపాటు సినిమా చిత్రీకరణ జరిపాలంటే ఎంత ఓపిక ఉండాలి. బాహుబలి ఘన విజయంతో ఆయన కృషి ఫలించింది. బాహుబలి సృష్టించిన రికార్డులు మళ్లీ రాజమౌళి బద్దలు కొట్టాలన్నా కష్టమే అనే రేంజ్ లో సినిమా ఆడుతోంది. 

బాహుబలి శాంపిల్... అసలు కథ ముందుంది..

Image result for bahubali prabhas posters
బాహుబలితో ఇప్పటికే తెలుగు సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లాడని అంతా అనుకుంటున్నారు. కానీ రాజమౌళి మాత్రం బాహుబలిని ఓ ప్రయోగంగానే భావించాడట. జీవితంలో తాను తీయాలనుకున్న ఓ మహా ప్రాజెక్టుకు ముందు.. దీన్నో శాంపిల్ గా తీశాడట.. ఆ మహా ప్రాజెక్టేమిటంటే.. మహా భారతాన్ని సినిమాగా తీయడం. 

మహాభారతమంటే మాటలు కాదు.. వందల క్యారెక్టర్లు.. పదుల సంఖ్యలో కీలకమైన పాత్రలు.. ఒక్కోదానికీ దానికదే ప్రత్యేకమైన వ్యక్తిత్వం.. అవన్నీ తెరపై అత్యద్భుతంగా తాను ఆవిష్కరించగలనా లేదా.. అని పరీక్షించుకోవడం కోసమే ముందు శాంపిల్ గా బాహుబలి తీశాడట. ఈ విషయాన్ని ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవల ఇంటర్వ్యూలో బయటపెట్టారు. మరి జక్కన్న తాను అనుకున్నట్టుగా మహా భారతం తీస్తే.. అది నిజంగా మహాద్భుతమే కాగలదు.. నో డౌట్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: