ఆగష్టు మొదటి వారంలో విడుదల కాబోతున్న ‘శ్రీమంతుడు’ సినిమాకు సంబంధించి ఒక ఆ శక్తికర న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది. మహేష్ ఈసినిమాకోసం ఇప్పటి వరకు తన కెరియర్ లో కనిపించని విధంగా 7 షేడ్స్ లో కనిపించి హడావిడి చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మహేష్ సినిమాలలో కనిపించని కొన్ని మాస్ సీన్స్ అదేవిధంగా డాన్స్ లు ‘శ్రీమంతుడు’ కు అదనపు ఆకర్షణగా మారుతుంది అని అంటున్నారు.  

మహేష్ తన గత సినిమాలలోని పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలోని మహేష్ పాత్రను 7 రకాల రూపాలతో దర్శకుడు కొరటాల శివ చూపించాడని వార్తలు వస్తున్నాయి. ‘శ్రీమంతుడు’ లో మహేష్ కనిపించే లుక్స్ ను లెక్కకు తీసుకుంటే 7 రూపాలు కనిపిస్తాయని ఫిలింనగర్ టాక్. ఈ ఏడు లుక్స్ ‘శ్రీమంతుడు’ కి స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయని తెలుస్తోంది.

ఇప్పటిదాకా విడుదలైన ఈ సినిమా టీజర్,  ట్రైలర్లని బట్టి చూస్తే మహేష్ రెండు మూడు అవతారాల్లోనే కనిపించాడు. బిజినెస్ మేగ్నెట్ గా కాలేజీ స్టూడెంట్ గా సైకిల్ వేసుకొని ఊళ్లో తిరుగుతూ ప్లే బాయ్ రూపంలో  కనిపించాడు. అయితే ‘శ్రీమంతుడు’ సినిమాలోమాత్రం మరో నాలుగు లుక్కులు ఉంటాయట. ఒక లుక్కులో లుంగీ కట్టుకొని మరో లుక్కులో పెద్దపెద్ద ఆయుధాలు పట్టుకుని మహేష్ సందడి చేస్తాడని సమాచారం. మరి కొన్ని లుక్స్ మాత్రం సస్పెన్స్ అంటున్నారు.

ఈసినిమా కథ విదేశాల్లో మొదలై పల్లెటూరికి చేరుతుంది కాబట్టి మహేష్ పాత్రకు ఇన్ని లుక్కులు అవసరమని కొరటాల శివ భావించాడని తెలుస్తోంది. వాస్తవానికి ఇన్ని వేరియేషన్స్ లో మహేష్ ఎప్పుడూ కనిపించలేదు. దీనికి తోడు మహేష్ కు గతంలో కలిసివచ్చిన దేవుడి పాట సెంటిమెంట్ కూడ ‘శ్రీమంతుడు’ హిట్ కావడానికి దోహద పడుతుంది అని అంటున్నారు. శ్రుతిహాసన్ గ్లామర్ తో పాటుగా ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడం ‘శ్రీమంతుడు’ కి ప్లస్ అవుతుంది అని అంటున్నారు. దీనికి తోడు తన తమిళ ‘శ్రీమంతుడు’ వర్షన్ కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు అని టాక్. ఫిలింనగర్ లో ఇప్పుడు ఎక్కడ విన్నా ‘శ్రీమంతుడు’ వార్తలే వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: