అనుకోని విధంగా సక్సెస్ వస్తే..ముందుగా ఇబ్బండి పడేది ఆ రికార్డ్ కి కారుకులైన వారే. ఎందుకంటే వారి మీద, అందరిలోనూ విపరీమైన గౌరవం, హోప్స్..ఇలా అన్ని రకాలైన ఎక్స్ పెక్టేషన్స్ కలిగి ఉంటారు. ఎదుటి వారి అంచనాలకు అనుగుణంగా రికార్డ్స్ సాధించిన వ్యక్తులు ఉండగలగాలి. బాహుబలి విషయంలోనూ అదే  జరుగుతుంది.

బాహుబలి మూవీ గ్రాండ్ సక్సెస్ సాధించిన తరువాత ఆ మూవీ డైరెక్టర్ ని ఆకాశినికి ఎత్తేసింది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ తరువాత ఆ మూవీ స్టోరి రైటర్ సక్సెస్ రేటు గురించి తెలుసుకొని, విజయేంద్రప్రసాద్ ని మరింత ఫోకస్ చేసింది మీడియా. దీంతో బాహుబలి సక్సెస్ లో కీలక వ్యక్తిగా స్టోరి రైటర్ అయిన విజయేంద్రప్రసాద్ ముందు వరుసలో ఉన్నాడు.

దీంతో ఇప్పటికే సిద్ధంగా బాహుబలి2 కథలో భారీ మార్పులు చేసే దిశగా విజయేంద్రప్రసాద్ తన కలాన్ని కదిలించాడు. అయితే రాజమౌళి సైతం, కొన్ని రకాల ఊహించని విధంగా ట్విస్ట్ లను పెట్టాలని తండ్రిని..డైరెక్టర్ హోదాలో అడిగాడంట. దీంతో రాజమౌళి కోరిక ట్విస్ట్ లు...విజయేంద్రప్రసాద్ సైతం ఆశ్ఛర్యపోయాడంట. బాహుబలి 2 మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళాలి.

కాని ఈలోపు రాజమౌళి కోరిన కథలోని మార్పులు..తనని ఇరకాటంలో పడేసిందని అంటున్నాడు. ఇలా అయితే మరో మూడు నెలలు పాటు బాహుబలి2 కథ పూర్తవటానికి సమయం పడుతుందని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చాడు. దీంతో బాహుబలి2 షూటింగ్ కొంత కాలం వాయిదా పడే అవకాశం ఉందని చిత్ర వర్గాల్లో టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: