వినాయక్ డైరెక్షన్‌లో అఖిల్ అక్కినేని  నటిస్తున్న సినిమాలో సాయేషా సైగల్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరికీ  సంబంధించిన ఒక న్యూస్ పై ఇప్పుడు ఫిలింనగర్ లో రకరకాల కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో  బాగా  క్లోజ్‌ ఫ్రెండ్స్ గా మారిన వీరిద్దరి న్యూస్ ఇప్పుడు మీడియాకు హాట్ న్యూస్. 

అఖిల్ ఏమనుకున్నాడో ఏమో తెలియదు కాని తనతో మొట్టమొదటిసారి కలిసి నటిస్తున్న సాయేషాకు తనతో సమానంగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. అఖిల్‍కు ట్విట్టర్‌లో లక్షల్లో  ఫాలోయర్స్ ఉన్న నేపధ్యంలో  తన ట్విటర్ పేజీలో ఈ బ్యూటీ ట్విటర్ లింక్ పోస్టు చేశాడు దీనితో అఖిల్‌ ఫ్యాన్స్ అంతా ఈమెను ఫాలో కావడం మొదలుపెట్టారు. 

అంతేకాదు సాయేషా సూపర్ టాలెండ్ పర్సన్ అని, సూపర్ హార్డ్‌వర్క్ చేసే అమ్మాయంటూ ఆమె పై పొగడ్తలు గుప్పిస్తున్నాడు అఖిల్. ఈ విషయమై సోషల్ మీడియాలో అఖిల్ పై రకరకాల సెటైర్లు పడుతున్నాయి. కొందరు అఖిల్ ది గ్రేట్ అంటూ కామెంట్ చేస్తూ ఉంటే మరికొందరు సాయేషా పై అఖిల్ కు ఇంత ప్రేమ ఏమిటి అంటూ సెటైర్లు వేస్తున్నారు. 
అంతేకాదు కామన్‌మేన్‌కు కూడ ఇలాంటి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అంటూ అఖిల్ కు చురకలు అంటిస్తున్నారు.

ఈ వార్తలు ఇలా ఉండగా అఖిల్ ఈ సినిమాలో డ్యాన్సులు బాగా చేస్తున్నాడని, స్క్రీన్ మీద చాలా స్టైలిష్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తాడని వార్తలు  వస్తున్న నేపధ్యంలో రాబోతున్న రోజులలో అఖిల్ మహేష్ కు గట్టి పోటీ ఇస్తాడు అంటూ అప్పుడే కామెంట్స్ మొదలు అయిపోయాయి. అక్టోబర్ లో విడుదలకాబోతున్న ఈ సినిమా ఆడియోను అక్కినేని నాగేశ్వరావు పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 20న చాల భారీ స్థాయిలో విడుదల చేస్తారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి సినిమా షూటింగ్ లో ఉండగానే అఖిల్ పై హీరోయిన్ గాసిప్పులు మొదలు కావడం నాగార్జునకు షాకింగ్ గా మారుతుంది అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: