రాజమౌళి పై ఢిల్లీ బ్యూటీ తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇండియన్ సినిమాగా సంచలనాలు సృష్టిస్తున్న ‘బాహుబలి’ సినిమాను రాజమౌళి మలిచిన తీరుపై తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది అనితెలుస్తోoది. 

కొంతమంది అయితే తాప్సీకి టాలీవుడ్ లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో అందరి దృష్టినీ ఆకర్షించడానికి తాప్సీ ఈఘాటు వ్యాఖ్యలు చేసింది అని అంటున్నారు. ప్రస్తుతం తన స్నేహితులు తన చెల్లెలితో కలిసి ఓ వెడ్డింగ్ ప్లానర్ కంపెనీని నడుపుతున్న తాప్సీ రికార్డులను  సృష్టిస్తున్న ‘బాహుబలి’ పై చేసిన వ్యాఖ్యలు టాపిక్ అఫ్ టాలీవుడ్ గా మారాయి. 

ఈమధ్య ఈహాట్ బ్యూటీ  ‘బాహుబలి’ సినిమాను చూసిందట. అయితే ఈ సినిమాలో  (అవంతిక) తమన్నా క్యారెక్టర్ ని చూపించిన తీరు ఏమంత గొప్పగాలేదు అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు కథానాయికల రోల్ ఎప్పుడూ హీరోల్ని హైలైట్ చేసేందుకేనా? అంటూ ప్రశ్నిస్తోంది. దర్శకులు కథానాయికల పాత్రల్ని ఎప్పుడూ వన్ సైడెడ్ గానే చూపిస్తున్నారని అదేవిధంగా హీరోయిన్ పాత్ర ఎప్పుడూ హీరోని మెప్పించడానికే అన్నట్లుగా తెరపైచూపిస్తున్నారు అంటూ దర్శకుల పై దాడి మొదలు పెట్టింది తాప్సీ. 

అసలు ‘బాహుబలి’ లో  తమన్నా క్యారెక్టర్ కి అంత ప్రాధాన్యత ఏమి  ఉంది?' అని సూటిగా ఆమె వేసిన ప్రశ్న నేరుగా రాజమౌళినే ఢీ కొడుతుందనడంలో సందేహమే లేదు. ఇప్పటికే ఒక ప్రముఖ మహిళా జర్నలిస్టు ప్రభాస్ తమన్నాల పచ్చబొట్టు పాటపై విరుచుకు పడుతూ రేప్ ఆఫ్ అవంతిక అంటూ పెద్ద వ్యాసాలు రాసిన విషయం తెలిసిందే. ఇలాంటి  పరిస్థితుల నేపధ్యంలో తాప్సీ కూడ తమన్నా పాత్రపై తన ప్రశ్నలతో ముందుకు రావడంతో రాజమౌళి తాప్సీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాడా లేదంటే మౌనం వహిస్తాడా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: