తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న హీరో పవన్ కళ్యాన్. మెగా స్టార్ చిరంజీవి తమ్ముడిగా వెండి తెరకు పరిచయం అయిన పవన్ కొత్తలో అంతగా సక్సెస్ కాలేక పోయాడు తర్వాత తొలిప్రేమ, తమ్ముడు,జల్సా,అత్తారింటికి దారేది చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకరిగా నిలిచాడు. అత్తారింటికి దారేది చిత్రం తర్వాత పవన్ ఏ సినిమాల్లో నటించలేదు కాకపోతే  వెంకటేష్, పవన్ కళ్యాన్ నటించిన ‘గోపాల గోపాల’ చిత్రంలో గెస్ట్ రోల్ చేశాడు.

తాజాగా పవర్ సినిమా డైరెక్టర్ బాబీ తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా గబ్బర్ సింగ్ 2 అని కొంతకాలంగా ప్రచారంలోకి వచ్చినా  ఈ మద్య టైటిల్ మార్చినట్లు తెలిపారు. కథకు తగ్గట్టుగా పవర్ ఫుల్ టైటిల్  సర్దార్ అనే టైటిల్ ఫైనల్ చేశారు. ఈ చిత్రం షూటింగ్ పూనేలో జరిగింది కాకపోతే ఆ షూటింగ్ లో పవన్ పాల్గొనలేదు.  . ఈనెల 29 నుంచి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేయనున్నారు.

ఫ్యాన్స్ మేడ్ పోస్టర్


ఈ షెడ్యూల్లో యాక్షన్ పార్ట్ చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ పార్ట్ కోసం పవన్ కళ్యాణ్ తెగ ప్రాక్టీస్ చేసినట్లు తెలిసింది.  అంతే కాదు... చాలా రోజులుగా పెంచిన గడ్డం సైతం తీసేశాడు.ఇప్పటికి ఇంకా ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. త్వరలోనే ఈ సినిమాలోని హీరోయిన్ ను నిర్ణయిస్తారట. పవన్ ఎప్పుడు సినిమా కంప్లీట్ చేస్తారా ప్రేక్షకుల ముందు ఎప్పుడు సందడి చేస్తారా అని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: