వివి వినాయక్‌ దర్శకత్వంలో తెరంగేట్రం చేయబోతున్న అక్కినేని కుటుంబ యువహీరో అఖిల్‌ చిత్రానికి టైటిల్‌ ఖరారైందని సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ చిత్రానికి 'రాజాధిరాజ' అనే టైటిల్‌ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కినేని కుటుంబం నుంచి మాస్‌ హీరోగా ఎలివేట్‌ కావడానికి ట్రాక్‌ సెట్‌ చేసుకుంటున్న అఖిల్‌ కెరీర్‌కు... రాజాధిరాజ టైటిల్‌ బాగా నప్పుతుందని యూనిట్‌ అనుకుంటున్నారట. 


అక్కినేని అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అఖిల్‌ డెబ్యూ మూవీకి.. మొత్తానికి టైటిల్‌ సెట్‌ చేశారు. ఈ సినిమాను వినాయక్‌ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అక్కినేని వారసుణ్ని తెరకు పరిచయం చేయడానికి వచ్చిన అవకాశాన్ని వినాయక్‌.. బాగా వాడుకుంటున్నారని.. అందుకోసం బాగా కష్టపడుతున్నారని అనుకుంటున్నారు. ఈ చిత్రం మేకింగ్‌లో భాగంగా.. యాక్షన్‌ సన్నివేశాలు షూట్‌ చేసిన దృశ్యాలు కొన్ని వీడియోలు ఆ మధ్య బయటకు వచ్చాయి. అవి చూస్తేనే.. అఖిల్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కోసం.. ఎంతగా కష్టపడుతున్నారో అందరికీ అర్థం అవుతుంది. 


ఆ కష్టానికి ఫలితం దక్కాలనిపించేలా.. సినిమాకు సరైన టైటిల్‌ కోసం పలు పేర్లను పరిశీలించారట. చివరికి రాజాధిరాజ అనే టైటిల్‌ గ్రాండ్‌ గా ఉంటుందని ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇందులో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌ తదితరులు కూడా నటిస్తున్నారు. చిన్న కొడుకు డెబ్యూ మూవీ ప్రోగ్రెస్‌ మొత్తాన్ని దగ్గరుండి చూసుకుంటున్న నాగార్జున ఓకే చెప్పిన తర్వాత.. రాజాధి రాజ టైటిల్‌ను ప్రకటిస్తారని అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: