ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీ చాలా అదృష్టం చేసుకుందనే చెప్పుకోవాలి.. సాధారణంగా ఒక సంవత్సరంలో దాదాపు రెండు లేక మూడు సినిమాలు సూపర్ హిట్స్ అవుతాయి. కానీ ఈ సంవత్సరంలో వచ్చిన అగ్ర హీరోల సినిమాలు అన్నీ హిట్ మిద హిట్ కొట్టేస్తున్నాయి. పటాస్,టెంపర్,లయన్,సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు మంచి హిట్ టాక్ సంపాదించుకున్నాయి. ఇక ఈ సంవత్సరం విడుదలైన ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటింది. ఇప్పటి వరకు రాని హైక్ ఈ సినిమాకు రావడం కలెక్షన్ల సునామీ సృష్టించడం లాంటివి జరిగిపోయాయి. ఈ సినిమా కలెక్షన్లు ఇప్పటి వరకు 350 దాటినట్లు సమాచారం.\

ఇదే బాటలో ఇప్పుడు మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు రాబోతుంది. ఇక ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం 'శ్రీమంతుడు'. మహేష్‌బాబు హీరో. శ్రుతి హాసన్‌ హీరోయిన్. మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. 'శ్రీమంతుడు'శాటిలైట్ రైట్స్ మొత్తం 17 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం.అందులో తెలుగుకు 12 కోట్లు, హిందీ శాటిలైట్ రైట్స్ 5 కోట్లు అని ట్రేడ్ వర్గాల సమాచారం. జీ తెలుగు వారు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు వినికిడి . 


శ్రీమంతుడు లో మహేష్ బాబు

Srimanthudu Movie Latest Stills

ఈ సినిమా గురించి దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ... అతను అపర శ్రీమంతుడు. ధనంలో... గుణంలోను. జీవుడల్లె పుట్టి.. ఆ వూరికి దేవుడల్లె వచ్చాడు. స్నేహానికి నిర్వచనంలా, త్యాగానికి చిరునామాలా కనిపిస్తాడు. ఇక ఈ పాత్రకు మహేష్ బాబు అద్భుతంగా సూట్ అయ్యాడు..తని అందం గురించి ఏమని చెప్పాలి? అతని నవ్వు.. ప్రేమకు చిహ్నంలా ఆకర్షిస్తుంది.
మహేష్‌ లాంటి ఓ గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం ఇంత తొందరగా రావడం నా అదృష్టం. మహేష్‌ ఇమేజ్‌కి నాలుగు ఫైట్లు, పాటలు ఉంటే సరిపోదు. ఒక పెద్ద కాన్వాస్‌లో కథ ఉండాలని కష్టపడి రాశా. మహేష్‌తో ఈ సినిమా తీయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కూడా చాలా బాగా నటించింది. శ్రీమంతుడు'ని తమిళంలో 'సెల్వందన్‌' పేరుతో విడుదల చేస్తున్నాము''అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: