ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భజరంగీ భాయ్ జన్ మూవీ తడాఖా ఏంటో చూపిస్తుంటే, అంత కంటే విచిత్రమైన సంగతి మరొకటి జరిగింది. హిందీ కి ఏ మాత్రం సంబంధంలేని స్టార్ కాస్టింగ్ అయిన..డబ్డ్ మూవీ బాహుబలి దాదాపు 100 దిశగా రికార్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఒక తెలుగు మూవీకి ఇంతటి ప్రేక్షకాధరణ ఉండటం బహుశా బాలీవుడ్ లో ఇదే ప్రధమం. అందుకే బాహుబలి మూవీ సీక్వెల్ పై బిటౌన్ లో ఆసక్తి నెలకొంది. అయితే బాహుబలి2 కి రాజమౌళి కొత పంథా ఎంచుకున్నాడు.

అందుకు దాదాపు బాలీవుడ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక్కడ బాలీవుడ్ అంటే బాలీవుడ్ స్టార్ హీరోలు అని. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తెలుగు,తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన‘బాహుబలి’, ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన సినిమా అంటూ అంతర్జాతీయ పత్రికలు సైతం కొనియాడాయి. 

ఇక ఈ సినిమా అన్ని చోట్లా బ్లాక్‌బస్టర్‌గా నిలవడానికి రాజమౌళి విజన్, ఆర్ట్ వర్క్,ఇంతకు ముందెన్నడూ ఇండియన్ సినిమాలో చూడని గ్రాండియర్ ఒక ఎత్తైతే తమిళ ప్రేక్షకులూ ఈ సినిమా తమదిగా భావించడానికి సత్యరాజ్, రమకృష్ణ తదితర కీలక నటులు ఈ సినిమాలో భాగం కావడమే! 

ఇక బాహుబలి పార్ట్ 2 లో కొందరు హిందీ నటులను కూడా నటించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రాజమౌళి వారితో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇందుకు బాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి కనపబరిచారు. దీంతో రాజమౌళి ఆలోచనలను బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్వాగతించడం పట్ల సర్వత్రా పాజిటివ్ టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: