బాహుబలి విజయం అనంతరం, బాహుబలి తరహా చారిత్రక మూవీలు ఏవైన తెరకెక్కుతున్నాయంటే...ఇప్పుడు ఆ మూవీలపై హై ఎక్స్ పెక్టేషన్స్ ని పెట్టేసుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. అందుకే తెలుగులో రాబోతున్న రుద్రమదేవి, అలాగే తమిళంలోనూ భారీ బడ్జెట్ తో రాబోతున్న విజయ్ పులి చిత్రాలపై బాక్సాపీస్ మార్కెట్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా కోలీవుడ్ కి చెందిన స్టార్ హీరో విజయ్..రాజమౌళి పై కామెంట్స్ విసరటం హాట్ టాపిక్ మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తమిళ క్రేజీ ప్రాజెక్టుఅయిన పులకి, బాహుబలికి తాజాగా పోలికలు మొదలుపెట్టేశారు.తమిళంలో సుమారు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘పులి’ సినిమా మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆగష్టు 2న చెన్నైలో విడుదల కానుంది. రాజమౌళి బాహుబలికి సౌత్ మార్కెట్ లో క్రేజ్ రాకముందే, విజయ్ నటించబోతున్న పులి చిత్రంపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే బాహుబలిలో నటించాల్సిన శ్రీదేవి, పులి మూవీలో నటిస్తుంది. దీంతో పులి, బాహుబలి కంటే ఘనమైన విజయాన్ని అందుకుంటుందనే తమిళుల అభిప్రాయం. అయితే తాజాగా పులి మూవీ నిర్మాతలు మాట్లాడుతూ.. ‘పులి’సినిమాకు, ‘బాహుబలి’ సినిమాకు పోలిక తెలేమని, రెండూ వేటికవే డిఫరెంట్ సినిమాలని తెలిపారు. గ్రాఫిక్స్ పరంగానూ‘పులి’ని ‘బాహుబలి’తో పోల్చకూడదని నిర్మాతలు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. 

ఇందుకు విజయ్ సైతం, పులి స్టోరి, గ్రాఫిక్స్ అనేవి బాహుబలికి పోటీ రావు. అలాగే పులి లాంటితో బాహుబలికి అస్సలు పోలిక ఉండదు. ఆ రికార్డ్ లు సపరేటు...ఈ రికార్డ్ లు సపరేటు. రాజమౌళి తరహా మూవీ త్వరలోనే సిద్ధమౌతుంది. అప్పుడు కోలీవుడ్ పేరు మరోసారి ఘనంగా వినపడుతుంది..అంటూ సన్నిహితులు వద్ద చెప్పుకొచ్చాడంట. ఈ మాట అందరికి లీకై..రాజమౌళి ని టార్గెట్ చేసిన విజయ్ అంటూ కోలీవుడ్ మార్కెట్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: