న్న ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ‘శ్రీమంతుడు’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఆ సినిమా దర్శకుడు కొరటాల శివ బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ ను టార్గెట్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. తాను పరిశీలించినంత వరకు ప్రస్థుత తరం నటులలో మహేష్ ఈ కాలపు ఉత్తమ నటుడు అని అనడమే కాకుండా మహేష్ అమీర్ ఖాన్ కంటే బెటర్ పర్ఫెక్షనిస్ట్ అని కామెంట్ చేయడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. దీనితో 600 కోట్ల కలెక్షన్స్ ను మించి వసూళ్ళు సాధించిన ‘పికె’ సినిమాలో నటించిన అమీర్ ఎక్కడా? మహేష్ బాబు స్థాయి ఎక్కడా? అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. 

ఇదే ఇంటర్వ్యూలో కొరటాల మహేష్ గురించి మాట్లాడుతూ రచయితగా తాను ఊహించుకున్న హీరో పాత్రను ఒక హీరో 50% శాతం చేసినాచాలు అనుకుంటానని అయితే మహేష్ మాత్రం దర్శకుడు రచయిత చెప్పిన క్యారెక్టర్ ను పట్టించుకున్న రోజునుంచి ఆసినిమా డబ్బింగ్ చెప్పే వరకు ఆ సినిమా గురించే ఆలోచిస్తూ ఆ సినిమాకు సంబంధించిన సీన్స్ షూటింగ్ లో మరోటేక్ తీసుకుందామా అంటూ దర్శకుడిని పరుగులు పెట్టిస్తూ ఉంటాడని అందువల్లనే మహేష్ అంత పెర్ఫ్క్షనిస్ట్ ను తాను ఎక్కడా చూడలేదు అంటూ ఏకంగా అమీర్ ఖాన్ నే టార్గెట్ చేస్తున్నాడు కొరటాల శివ. 

ఇదే సందర్భంలో ‘శ్రీమంతుడు’ పాత్ర చిత్రీకరణ వెనుక ప్రపంచ ధనవంతుల లిస్టులో అగ్రస్థానంలో ఉంటూ తన సంపాదనలో మూడు వంతుల భాగం సమాజానికి ఇచ్చివేసిన వారెన్ బఫెట్, బిల్ గేట్స్, విప్రో ప్రేమ్ జీల ప్రభావం ‘శ్రీమంతుడు’ కథ పై ఉంది అంటూ మరొక ఆశ్చర్యపరిచే ట్విస్ట్ ఇచ్చాడు కొరటాల.

అయితే చాలామంది అనుకుంటున్నట్లు ద్వితీయ విఘ్నం  లాంటి సెంటిమెంట్లు తనకు కాని మహేష్ కు కాని లేవని ‘శ్రీమంతుడు’ ‘మిర్చి’ సినిమాను మించిన సూపర్ హిట్ గా మారి కలక్షన్ల ‘శ్రీమంతుడు’ గా మారిపోతాడు అని కొరటాల చెపుతున్న విషయాలు ఎన్ని నిజాలో ఆగష్టు 7న తెలిసిపోతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: