మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్.. మరి ఆ ట్రెండ్ కంటిన్యూ  చేసేది ఎవరా అన్న సమయంలో వచ్చాడు అన్నకు తగ్గ తమ్ముడు పవన్ కళ్యాన్.. ఇప్పుడు పవన్ కళ్యాన్ అంటే సినిమా ఇండస్ట్రీలో నే కాదు అటు రాజకీయ రంగంలో కూడా సంచలనమే..!   ప్రస్తుత తరం తెలుగు నటులలో తనకంటూ ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్న నటుడు పవన్ కళ్యాన్.  అయితే గతంలో పవన్ కళ్యాన్ నటించిన సినిమాలు పెద్దగా ఆడక పోయినా పవన్ మ్యానరిజం అందరినీ ఆకర్షించింది. త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా,అత్తారింటికి దారేది పవన్ తెలుగు ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదిగేలా చేశాయి.

ఇక గబ్బర్ సింగ్ సినిమాతో మనోడు ఒక ట్రెండ్ సృష్టించాడు. తర్వాత రాజకీయ రంగం వైపు వెళ్లి ‘జనసేన’ అనే కొత్త పార్టీ పెట్టాడు. ప్రశ్నించాడని వస్తున్నా అనే నినాదంతో ప్రజల్లోకి దూసుకు వెళ్లాడు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత గోపాల గోపాల అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత తెరపై పవన్ కళ్యాన్ కనిపించలేదు.దీంతో పవన్ అభిమానులు నిరాశకు లోనైన సమయంలో గబ్బర్ సింగ్ 2 సినిమా తో మళ్లీ తెరపై కనిపించ బోతున్నాడు. అయితే ఈ మద్య సినిమా టైటిట్ మార్చారు ఎందుకంటే ఈ సినిమాలో తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని అందుకు పవర్ ఫుల్ టైటిల్ అయితే బాగుంటుందని అందుకే ఆ సినిమాకు ‘సర్దార్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు.

సర్ధార్ గా పవన్ కళ్యాన్


పవర్ సినిమా డైరెక్టర్ బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గత నెలలో పూణెలో మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ మొదైలైంది హైద‌రాబాద్ అల్యూమీనియం ఫ్యాక్ట‌రీలో షూటింగ్ మొద‌లైంది. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా పాల్గొంటున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా కోసం గ‌డ్డం తీసేసి ఫ్రెష్ లుక్ లోకి మారిపోయాడు ప‌వ‌ర్ స్టార్. గత కొంత కాలంగా పవన్ సాధువులా గడ్డం పెంచుకొని ఉండటం చూసి జనాలకు బోర్ కొట్టింది. మరి ఇప్పుడు పవన్ న్యూలుక్ లో ఎలా ఉండబోతున్నాడో పవన్ అభిమానులకు ఉత్కంఠ నెలకొంది. అయితే ప‌వ‌న్ కళ్యాణ్ లుక్ కు సంబంధించిన ఫోటోలు మాత్రం ఇప్ప‌టికీ బ‌య‌టికి రాలేదు.  ఇక ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా కంటిన్యూ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: