జీవిత రాజశేఖర్ దంపతులకు కెరియర్ పరంగా ప్రస్తుతం నడుస్తున్న కాలం ఏమి కలిసిరావడంలేదు. దీనితో వీరిద్దరి పని అయిపోయింది అని చాలామంది అనుకుంటున్న నేపధ్యంలో జీవిత కేంద్ర సెన్సార్ బోర్ద్ సభ్యురాలిగా నామినేట్ కావడంతో మళ్ళి జీవిత హవా టాలీవుడ్ లో మొదలు అయింది.  సినిమాలకు దూరం అయిన జీవిత ఈమధ్య బుల్లితెర ప్రోగ్రామ్ కు ప్రజంటర్ గా మారి తన స్థాయిని పెంపొందించుకొవడానికి ప్రయత్నిస్తోంది. 

ఈ నేపధ్యంలో జీవిత నిన్న జరిగిన ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో అతిధిగా పాల్గొంటూ ఒక టాప్ డైరెక్టర్ కు సంబంధించిన విషయాలను బయట పెట్టింది. టాలీవుడ్ సినిమా రంగంలో క్రియేటివ్ దర్శకుడిగా పేరు గాంచిన తేజ మొత్తం  అందరూ తెలంగాణ టెక్నీషియన్స్ తో  నిర్మించిన ‘హోరాహోరి’ సినిమా ఆడియో ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో జరిగింది.

ఈవేడుకకు జీవితను అతిధిగా పిలిచారు. ఆ ఫంక్షన్ లో జీవిత మాట్లాడుతూ దర్శకుడు తేజాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది జీవిత. దర్శకుడు తేజ తాను 3వ క్లాస్ నుండి హైస్కూల్ వరకు కలిసి చదువుకున్నాము అంటూ తేజ చిన్ననాటి విషయాలను ఆ ఆడియో ఫంక్షన్ లో తెలియచేసి చాలామందికి ఆశ్చర్యాన్ని కలుగచేసింది జీవిత.

అంతేకాదు ప్రస్తుతం జీవిత చిన్న కుమార్తె తేజ కూతురు అయిలా కలిసి ఒకే కాలేజీలో చదువుకుంటూ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని కూడ తెలియ చేసింది జీవిత. ఈ సినిమాలో తేజ కూతురు అయిలా ఒక పాట పాడటం తనకు చాల ఆనందాన్ని కలిగించడమే కాకుండా తన కూతురే పాడినంత ఆనందం కలిగింది అని కామెంట్ చేసింది జీవిత. ప్రస్తుతo  టాలీవుడ్ దర్శకుల రేసులో చాల వెనకపడిపోయిన తేజాకు ఈ ‘హోరాహోరి’ ఏమైనా టర్నింగ్ ఇస్తుందేమో చూడాలి.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: