తెలుగు ఇండస్ట్రీలో వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా ‘దేవదాసు’ చిత్రంతో గోవా నుంచి వచ్చిన హాట్ బ్యూటీ ఇలియానా.. ఈ అమ్మడి నడుం అందాలకు కుర్రకారు పిచ్చెక్కి పోయారు. తర్వాత అగ్ర  హీరోల సరసన నటించి  ద‌క్షిణాదిన అగ్ర హీరోయిన్ల సరసన నిలిచింది. అప్పట్లో ఈ అమ్మడి గురించి దర్శక, నిర్మాతలు క్యూలు కట్టేవారు. దాదాపు కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నా కూడా ఆమె గురించి పోటీలు పడే స్థాయిలో ఉండేది ఇలియానా. దీంతో ఈ అందాల బొమ్మకు బాలీవుడ్ పై ఆశపుట్టింది.


దూర‌పు కొండ‌లు నునుపు అని పెద్దోళ్ళు ఊరికే అన‌లేదు...మంచి కెరీర్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీ వదిలేసి  ఎక్క‌డో దూరాన ఉన్న బాలీవుడ్ ని ఏలేద్దామ‌ని వెళ్లింది గోవాబ్యూటీ. ఇక బాలీవుడ్ లో  బ‌ర్ఫీ హిట్ట‌య్యేస‌రికి ఇక బాలీవుడ్ అంతా నా గుప్పిట్లోనే అన్నంత రేంజ్ లోకి వెళ్లిపోయింది. దీంతో తెలుగు లో ఎన్నో ఆఫర్లు వచ్చినా అవి సింపుల్ గా తోసి పుచ్చేసింది. ఒక ఊరికి రాజైనా మరో ఊరికి బంటు అన్న సామెత గుర్తుందికదా మరి ఈ అమ్మడి పరిస్థితి కూడా అలాగే తయారైంది. తెలుగులో ఎంతో క్రేజ్ ఉన్న ఈ అమ్మడు బాలీవుడ్ ఒక్క సినిమా ఈ అమ్మడిని కరివేపాకు తీసేసినట్లు తీసేశారు. దీంతో  ఇలియానా దుకాణం బంద్ అయిపోయింది. 


ఇప్పుడు ఇలియానా పరిస్థితి ఘర్ కా నా ఘాట్ కా అన్నట్టు ఇటు తెలుగులో..అటు హిందీలో ఆఫర్లు ఇచ్చే ప్ర‌స్తుతం షారుక్ ఫ్యాన్ సినిమాలో ఏదో చిన్న‌పాత్ర‌లో మెరుస్తుంది ఇలియానా. ఇక ఈ సినిమా హిట్ అయినా ఫట్ అయినా తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీవైపే రావాలని ఫిక్స్ అయ్యింది.  ఇందులో భాగంగానే అఖిల్ సినిమాలో ఐటం సాంగ్ చేయ‌డానికి ఒప్పేసుకుంద‌ని స‌మాచారం. నితిన్ తో గ‌తంలో రెచ్చిపో సినిమాలో న‌టించింది ఇలియానా. ఆ ప‌రిచ‌యంతోనే ఇప్పుడు అఖిల్ సినిమాలో ఐటం ఆఫ‌ర్ ప‌ట్టేసింద‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి



మరింత సమాచారం తెలుసుకోండి: