మెగాస్టార్ గా తెలుగు సినిమారంగాన్ని చక్రవర్తిలా ఏలిన చిరంజీవి  రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలో అతిథి పాత్రలో నటించడానికి ఇంచుమించు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చిరూ ఈ అంగీకారం వెనుక భారీ రెమ్యునరేషన్ ఆఫరింగ్ కూడ ఉంది అని ఫిలింనగర్ టాక్.

ఈ మూవీలో స్టంట్ మాస్టర్ రోల్ చేస్తున్న చరణ్ ఒక టాప్ స్టార్ కు డూప్‌ గా నటిస్తాడు అన్న విషయం ఇప్పటికే బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ టాప్ స్టార్ పాత్ర చేయబోతున్న చిరంజీవి  రెండు సీన్స్‌లోతిరిగి  చెర్రీ‌కి తిరిగి సాయంచేస్తాడని ఆ రెండు సీన్స్ నిడివి 5 నిమిషాల లోపు ఉంటుందని అంటున్నారు. అయితే ఈ 5 నిమిషాల పాత్రకు చిరంజీవికి 5  కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి

ఈపాత్రలో చిరంజీవి నటించడానికి అంగీకరించడంతో ఈసినిమా రచయిత కోన వెంకట్ ఆరెండుసీన్స్ రూపకల్పన పై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు చిరంజీవి ఈఅతిథి పాత్ర చేయడం వెనుక మరొక ఆలోచన ఉంది అని అంటున్నారు. రామ్ చరణ్ ‘మగధీర’ సినిమా తరువాత ఎన్ని సినిమాలలో నటించినా ఆస్థాయిలో మరో హిట్ అందుకోలేకపోయాడు. 

ఆలోటును తీర్చి చరణ్ కు ‘మగధీర’ కు మించిన హిట్ ఇవ్వడం కోసమే చిరంజీవికి వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా ఈ 5 నిముషాల అతిథి పాత్రను చెర్రీ శ్రీనువైట్ల నిర్మాత దానయ్యల ఒత్తిడి పై ఒప్పుకున్నాడు అని టాక్. మొదట్లో 50 కోట్ల సినిమాగా అనుకున్న చరణ్ లేటెస్ట్ సినిమా బిజినెస్ చిరంజీవి ఎంట్రీతో 70 కోట్ల స్థాయిలో బిజినెస్ జరగడమే కాకుండా ఎప్పటి నుంచో తన 150వ సినిమా గురించి ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు ప్రస్తుతానికి ఈవిధంగా సరిపెట్టాలని చిరంజీవి ఆలోచన అని అంటున్నారు. ఈ విషయం పై స్పష్టమైన క్లారిటీ రావాలి అంటే చిరంజీవి షష్టిపూర్తి వరకు ఆగాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: