రెండు రోజుల నుంచి ‘సర్దార్’ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ దర్శకుడు బాబీకి ఇచ్చిన మాటలు నిజంగా నిలబెట్టుకుంటాడా? అన్న టెన్షన్ మధ్య బాబి ‘సర్దార్’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభించినట్లు టాక్. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడ్డ ఈసినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ముందు పవన్ మరో 6 నెలల వరకు తాను ఏ రాజకీయ విషయం గురించి ఆలోచించకుండా ఈసినిమా పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా టార్గెట్ పెట్టుకుని దర్శకుడు బాబీకి సహకరిస్తానని వాగ్దానం చేసాడని వార్తలు వస్తున్నాయి.

అయితే షూటింగ్ ప్రారంభం అయిన రెండు రోజులకే ఊహించని విధంగా పవన్ ను టార్గెట్ చేస్తూ కొందరు మాట్లాడుతున్న మాటలు పవన్ ఏకాగ్రతను భంగం కలిగిస్తుందా అన్న టెన్షన్ బాబీకి ఏర్పడింది అని టాక్. నిన్న హీరో శివాజీ నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ గట్టిగా తలుచుకుని రెండు రోజులు జనం మధ్యకు వస్తే చాలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా విధిగా వస్తుందని అయితే ఈ విషయాలు పట్టించుకోకుండా పవన్ షూటింగ్ ల మధ్య ఉండటం ఏమిటి అంటూ ప్రశ్నించి మరోసారి పవన్ ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు.

దీనికితోడు తుళ్ళూరు ప్రాంతంలో రాజధాని నిర్మాణం కోసం తయారు చేయబడ్డ మాస్టర్ ప్లాన్ ను అనుసరించి దాదాపు రెండు మూడు గ్రామాలు పూర్తిగా ఖాళీ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలతో ఆ రెండు మూడు గ్రామాలకు చెందిన ప్రజలలో తీవ్ర అలజడి అప్పుడే మొదలైందని వార్తలు ఉన్నాయి. 

ఈ వార్తలు అన్నీ పవన్ దృష్టి వరకు వస్తున్నా ప్రస్తుతానికి ఏమి పట్టించుకోకుండా ‘సర్దార్’ సినిమా షూటింగ్ పైనే పవన్ దృష్టిని పెడుతున్నా భవిష్యత్ లో పరిస్థుతులు అనుకోని విధంగా మారిపోయి ఇన్నాళ్ళ గ్యాప్ తరువాత ప్రారంభం అయిన ‘సర్దార్’ షూటింగ్ కు మళ్ళీ అనుకోని బ్రేక్ పడుతుందా అన్న భయాన్ని దర్శకుడు బాబి తన సన్నిహితుల వద్ద వ్యక్త పరుస్తున్నట్లు టాక్. ఇచ్చిన మాటకోసం ఎటువంటి త్యాగాన్ని అయినా చేస్తాడు అన్న పేరున్న పవన్ దర్శకుడు బాబీకి ఇచ్చిన మాటను ఎంత వరకు నిలబెట్టుకుంటాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: