మాస్ హీరోగా మారాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన నాగచైతన్యకు ఏ ప్రయత్నం కలిసి రాకపోవడంతో ఇక లాభం లేదు అనుకుని చైతూ తిరిగి యూటర్న్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసంవత్సరం మలయాళ సినిమా రంగ బ్లాక్ బస్టర్ హిట్ గా మాలీవుడ్ లో సంచలనాలు క్రియేట్ చేసిన ఒక యూత్ లవ్ స్టోరీ పై నాగచైతన్య దృష్టి పడినట్లు తెలుస్తోంది. 

మలయాళంలో హిట్ అయిన ‘ప్రేమమ్’ ను తెలుగులో రామ్ హీరోగా రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే అటువంటి ఆలోచన తనకు లేదు అంటూ రామ్ ఆ వార్తలకు తెర దించాడు. దీనితో ఈమలయాళ సినిమా డబ్బింగ్ సినిమాగా మారి త్వరలో టాలీవుడ్ లో విడుదలవుతుంది అన్న వార్తలు వచ్చాయి. అయితే అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ ఈ సినిమా వ్యవహారం అక్కినేని కాంపౌండ్ కు చేరింది అన్న వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే అనేక లవ్ స్టోరీలతో హిట్లు కొట్టిన నాగచైతన్య ఈసినిమా రీమేక్ హక్కులను పొంది తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన తన తండ్రి నాగార్జునతో చేస్తున్నాడని టాక్. నిజానికి ఇది చాలా హృద్యమైన ప్రేమకధే అయినా చాల సంవత్సరాలక్రితం రవితేజా హీరోగా వచ్చిన ‘ఆటోగ్రాఫ్’ సినిమాకథకు ఈ ‘ప్రేమమ్’ సినిమా కథకు పోలిక ఉంది అన్న కామెంట్స్ ఇప్పటికే వచ్చాయి. ఇలాంటి పరిస్థుతులలో ఎప్పుడో విడుదలైన ‘ఆటోగ్రాఫ్’ లాంటి సినిమాలో మళ్ళీ నాగచైతన్య నటించడం రిస్క్ అనే మాటలు వినిపిస్తున్నాయి.

అయితే వెరైటీ ప్రయోగాలు చేసే విషయంలో ముందు వరసలో ఉండే నాగార్జున ఈ విషయంలో నాగచైతన్యకు ఎటువంటి సలహా ఇస్తాడు అన్న విషయం పై ఆసక్తి పెరుగుతోంది. మాస్ సినిమాలు అఖిల్ కు అప్పిచెప్పి లవ్ స్టోరీలు చైతూ చేయడానికి నిశ్చయించుకున్నాడు అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ‘ప్రేమమ్’ అక్కినేని కుటుంబ సొంతం అయినట్లే భావించాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: