రాజమౌళి రెండున్నర సంవత్సరాలు కష్టపడి తీర్చిదిద్దిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ దాదాపు రెండు సంవత్సరాలు ఏకభిగిన కష్టపడితే... బాహుబలి పార్ట్ ది బిగినింగ్ థియేటర్లో సందడి చేసింది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా చాటింది. అన్ని ఇండస్ట్రీల రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమా హీరో బాహుబలి ప్రభాస్ విషయానికి వస్తే.. రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.. వస్తూ వస్తూనే  ‘ఈశ్వర్’ మాస్ ఓరియెంటెడ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తర్వాత రాజమౌళి తీసిన చిత్రం ‘చత్రపతి’ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ గా మారిపోయారు.

ప్రస్తుతం తెలుగు ఇండస్టీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో ప్రభాస్ ఒకరు. అయితే ఈయన తోటి నటులు గోపిచంద్, ఎన్టీఆర్,అల్లు అర్జున్,విష్ణు ఈ మద్యే పెళ్లి అయిన మంచు మనోజ్,అల్లరి నరేష్ అంతా ఒకే టైంలో కెరీర్ మొదలు పెట్టిన వాళ్లే మరి వాళ్ల పెళ్లిళ్లు అయ్యాయి కొందరికి పిల్లలు కూడా పుట్టేశారు. ప్రస్తుతం ప్రభాస్ వయసు 35 మరి మనోడి పెళ్లి ఎప్పుడా అని అందరూ చర్చించుకుంటున్నారు. వాస్తవానికి బాహుబలి చిత్రం షూటింగ్ టైమ్ లోనే పెళ్లి కావాల్సింది కానీ ప్రభాస్ తన కెరీర్ కే పెద్ద పీట వేశాడు. ఇక ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు  ప్రభాస్ వద్దంటున్నా పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టేసారు.

తల్లిదండ్రులతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్


ఆ మధ్య ప్రభాస్ కు భీమవరంలో ఓ సంబంధం చూసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ లేదు అని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ వాస్తవానికి ప్రభాస్ అన్నదాంట్లో నిజం లేదని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు పెళ్లి ప్రస్తావన తెస్తే బాహుబలి పై దృష్టి మళ్లిపోతుందని అభిప్రాయం. కానీ మనోడి పప్పులేం ఉడికేలా లేవట ఈ సారి పెళ్లి ఖచ్చితంగా చేసే తీరాలని ప్రభాస్ కుటుంబ సభ్యులు నిశ్చియించారట.

వాస్తవానికి భీమవరం అమ్మాయిని రెబల్ స్టార్ ఫ్యామిలీ ఫిక్స్ చేసారని, అమ్మాయి నచ్చడంతో ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం...ప్రభాస్ పెళ్లాడబోయే భీమవరం అమ్మాయి ఇంజనీరింగ్ చదువుకున్నట్లు తెలుస్తోంది. అయితే ‘బాహుబలి' పార్ట్ 2 పూర్తయ్యే వరకు తన పెళ్లి విషయాలు బయటకు పొక్కనీయవద్దని, అయితే ‘బాహుబలి' పార్ట్ 2 పూర్తయ్యే వరకు తన పెళ్లి విషయాలు బయటకు పొక్కనీయవద్దని, మీడియా వారు అనవసర హంగా సృష్టిస్తారని, ఆ ఎఫెక్ట్ ‘బాహుబలి' పార్ట్2 మీద పడకుండా ఉండేందుకే ప్రభాస్ పెళ్లి విషయం గోప్యంగా ఉంచుతున్నారని సమాచారం.  



మరింత సమాచారం తెలుసుకోండి: