తెలుగు చిత్ర పరిశ్రమలో ‘సిసింద్రి’  సినిమాతో బుల్లి బుల్లి అడుగులు వేస్తూ అందరిని కడుపుబ్బా  నవ్వించిని కుర్రాడు ‘మనం’ సినిమాతో ఒక్క ఝలక్ ఇచ్చాడు. ఇక హీరోగా పర్ఫెక్ట్ అని అందరి అభిమానాన్ని చురగొన్న హీరో అక్కినేని అఖిల్. అక్కినేని నాగార్జున వారసుడిగా తెరంగ్రేటం చేయబోతున్న అఖిల్ అక్కినేని ఇప్పుడు వివివినాయక్ దర్శకత్వంలో ఫుల్ మాస్ ఓరియెంటెడ్ సినిమా తీస్తున్నాడు.

ఇప్పటి వరకు అక్కినేని వంశం నుంచి డైరెక్ట్ గా ఎవరూ మాస్ ఇమేజ్ తో రావాలని ప్రయత్నించలేదు.. రాలేదు కూడా. అప్పట్లో విక్రమ్ సినిమాతో నాగార్జున్ కాస్త మాస్ అనిపించినా అది పూర్తి లవ్ స్టోరీ కాబట్టి అంత పెద్ద ఎఫెక్ట్ పడలేదు. ఇప్పుడు తొలి సినిమాతోనే మాస్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. తొలి సినిమాలో అఖిల్ డాన్స్ మూమెంట్స్, ఫైట్ సీక్వెన్స్ హైలెట్ అయ్యేలా చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ రెగ్యూలర్ గా జరుగుతుంది చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. మరి ఏరోజు అనుకుంటున్నారా..? అదేనండి మన హీరోగా తండ్రి అక్కినేని నాగార్జున పుట్టిన రోజు ఆగస్టు 29 ఆ రోజున గ్రాండ్ గా టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. 


విక్రమ్ చిత్రంలో నాగార్జున, సిసింద్రిలో అఖిల్ ఫస్ట్ మూవీస్


ఇక పోతే ఈ సినిమాలో అఖిల్ అక్కినేని మాస్ ఓరియెంటెడ్ కాకుండా కాస్త రొమాంటిక్ సన్నివేశాలు కూడా కూసింత ఎక్కువే చేశారని వినికిడి. ఈ సినిమాలో డీప్ గా లిప్ లాక్ సీన్లు ఉన్నాయట.. మరి తొలి సినిమాలోనే అఖిల్ ఈ రేంజిలో రెచ్చిపోవడం చర్చనీయాంశం అయింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. మొత్తానికి అక్కినేని వంశం నుంచి మరో వారసుడు కూడా రాబోతున్నాడు. మరి ఈ హీరో ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో.. యంగ్ హీరోలతో ఎలా పోటీ పడుతాడో వేచి చూడాల్సిందే...


మరింత సమాచారం తెలుసుకోండి: