పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అత్తారింటికి దారేది సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. గోపాల గోపాల సినిమాలో ఇంట్రవెల్ తర్వాత గెస్ట్ రోల్ కృష్ణుడు పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత మళ్లీ చాలా గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా రవితేజ పవర్ సినిమా డైరెక్టర్  కెఎస్.రవీంద్ర(బాబీ)  దర్శకత్వంలో గబ్బర్ సింగ్2 గత నెలలో షూటింగ్ మొదలు పెట్టారు. అయితే ఈ టైటిల్ సినిమా కు తగ్గట్టుగా లేనందున ‘సర్ధార్’ అటే టైటిల్ మార్చారు.

 పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘సర్దార్' పస్ట్ లుక్ విడుదలైంది. నిర్మాత శరత్ మరార్ తన ట్విట్టర్ ద్వారా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. గబ్బర్ సింగ్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ ఆ మద్య గడ్డం పెంచుకొని ఉండటంతో అసలు సినిమా ఇప్పట్లో మొదలు అవుతుందా అన్న అనుమానం కలిగింది దానికి తోడు సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే గత నెలలో పూణే లో మొదటి షెడ్యూల్ ప్రారంభం అయ్యింది కానీ ఇందులో పవన్ పాల్గొనలేదు. ఇప్పుడు రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యింది ఇందులో పవన్ పాల్గొనాల్సి ఉంన్నా కాస్త ఆలస్యం అయ్యింది.  


పవన్ కళ్యాన్ 



ఎట్టకేలకు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ రెండు రోజుల క్రితం  హైదరాబాద్ లో ప్రారంభం అయింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ షూటింగులో జాయిన్ అయ్యారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి  ఫస్ట్ లుక్ రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫస్ట్ లుక్ హల్ చల్ చేస్తోంది.ప్రస్తుతం ఈ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం అయింది. ఈ షూటింగ్ లో పవన్ యాక్షన్ సీన్లలో పాల్గొంటున్నాడు.  జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే సినిమాకు సంబంధించిన స్క్రిప్టు బాధ్యతలు పవన్ కళ్యాణ్ దగ్గరుండి పర్యవేక్షించారు. 

శరత్ మరార్ ట్విట్

మరింత సమాచారం తెలుసుకోండి: