కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం 'శ్రీమంతుడు'. మహేష్‌బాబు హీరో. శ్రుతి హాసన్‌ హీరోయిన్. మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సినిమా గురించి దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ... అతను అపర శ్రీమంతుడు. ధనంలో... గుణంలోను.. అన్నింటా గొప్పవాడైన యువకుడు.. ఆ వూరికి దేవుడల్లె వచ్చాడు. స్నేహానికి నిర్వచనంలా, త్యాగానికి చిరునామాలా కనిపిస్తాడు. ఇక ఈ పాత్రకు మహేష్ బాబు అద్భుతంగా సూట్ అయ్యాడు..తని అందం గురించి ఏమని చెప్పాలి? అతని నవ్వు.. ప్రేమకు చిహ్నంలా ఆకర్షిస్తుంది. 


ఇప్పుడు శ్రీమంతుడు విడుదల కాకముందే సంచలనాలు సృష్టిస్తుంది...‘శ్రీమంతుడు' మూవీ మహేష్ బాబు కెరీర్లోనే బెస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచింది. సినిమా ఓవరాల్ బిజినెస్ రూ. 80 కోట్లు క్రాస్ అయింది. ఈ చిత్రం  మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇంతకు ముందు మహేష్ చిత్రం ‘దూకుడు’ విడుదలైన తర్వాత రూ. 56 కోట్లు వసూలు చేసింది.. కానీ శ్రీమంతుడు విడుదల ముందే ఆ మార్కును క్రాస్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. 


శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు

Srimanthudu Movie Latest Stills

శ్రీమంతుడు మూవీ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటేల్స్..!


నైజాం(అభిషేక్ పిక్చర్స్): రూ. 14.4 కోట్లు

సీడెడ్(కడప బ్రహ్మ): రూ. 7.2 కోట్లు 

వైజాగ్(జిఎస్ఆర్ ఫిల్మ్స్): రూ. 5 కోట్లు 

గుంటూరు : రూ. 4.20 కోట్లు

 ఈస్ట్(వింటేజ్ ఫిల్మ్స్): రూ. 3 కోట్లు 

వెస్ట్(ఆదిత్య ఫిల్మ్స్): రూ. 3.10 కోట్లు 

కర్నాటక(ఎన్ఎస్ఆర్-బృందా అసోసియేట్స్): రూ. 6 కోట్లు

 ఓవర్సీస్(క్లాసిక్ ఎంటర్టెన్మెంట్స్): రూ. 8.2 కోట్లు 

రెస్టాఆఫ్ ఇండియా: రూ. 2 కోట్లు ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: రూ. 58 కోట్లు శాటిలైట్స్ రైట్స్ రూ. 17 కోట్లు, ఆడియో, ఇతర రైట్స్: 2 కోట్లు, తమిళ డబ్బింగ్ రైట్స్: రూ. 3 కోట్లు.... టోటల్ బిజినెస్ ఇప్పటి వరకు రూ. 80 కోట్లకు చేరుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: