ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా ఒక సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తే ఆ సినిమా షూటింగ్ మొదలు విడుదల అయ్యే వరకు ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలోనో, పేపర్ ద్వారానో హడావిడి చేయడం పరిపాటైంది. ఒకప్పుడు థియేటర్లో, టీవీల్లో,పేపర్లో సినిమాకు సంబంధించి అడ్వర్టైజ్ మెంట్స్ ఇచ్చి పబ్లిసిటీ చేసేవారు. ఏ సినిమాకైనా ప్రమోషన్‌ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. సినిమా ఎంత బడ్జెట్ తో నిర్మించాం అనేది కాదు ఎంత పబ్లిసిటి చేశాం అన్నదే ముఖ్యం.

తెలుగులో ఇప్పటివరకు ఏ సినిమాకు రాని హైక్  ‘బాహుబలి’ వచ్చింది.. ఇప్పుడు ఈ సినిమా  స్టయిలే అందరూ ఫోలో అవుతున్నారు. అసలు సినిమా థియేటర్లోకే రాని వారిని కూడా థియేటర్లకు రప్పించిన గ్రేట్ చిత్రంగా ‘బాహుబలి’ నిలిచింది. వాస్తవానికి ఎంత బడ్జెట్‌తో తీసిన సినిమాకైనా డైలీ పేపర్స్‌లో యాడ్స్‌ ఇస్తారు. కానీ, ‘బాహుబలి’ చిత్రానికి మాత్రం అలా జరగలేదు. టి.వి. ఛానల్స్‌కి కూడా యాడ్స్‌ ఇవ్వకుండా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకనిర్మాతలు. కాకపోతే రాజమౌళి మొదటి నుంచి చిత్రానికి సంబందించిన ప్రతీది జనాలతో తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.

శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు


ఈ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసిన స్టిల్స్‌, ట్రైలర్స్‌, మేకింగ్‌ వీడియోస్‌తో సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది.  ఇప్పుడు ఇదే దారిని ఎంచుకున్నాడు ‘శ్రీమంతుడు’ ఈ సినిమా పబ్లిసిటీ పంథా చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్‌, పోస్టర్స్‌, ప్రోమోస్‌ను వరసగా రిలీజ్‌ చేస్తున్నారే తప్ప పేపర్‌ పబ్లిసిటీనిగానీ, ఛానల్‌ పబ్లిసిటీనిగానీ, వెబ్‌ పబ్లిసిటీనిగానీ పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు.  ఫ్రీ పబ్లిసిటీతోనే ఈ చిత్రాన్ని కూడా గట్టెక్కించాలని చూస్తున్నారు నిర్మాతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: