గత కొద్దిరోజులుగా మౌనంగా ఉంటున్న రేణుదేశాయ్ తిరిగి తన ట్విటర్ లో సందడి చేస్తూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ పవన్ వ్యక్తిగత అలవాట్ల పై స్పందించింది. ఈమధ్య కాలంలో తనకు ఆరోగ్యం సరిగ్గా లేదు అంటూ తాను తీయబోయే సినిమాల గురించి తన ఆరోగ్యం సరైన తరువాత మాత్రమే చెపుతాను అంటూ కామెంట్ చేసింది.

ఇక ఆ అభిమాని పవన్ కొడుకు అకిరా నందన్ బాగా అల్లరి చేస్తాడా ? ఎప్పుడైనా అకిరాను కొట్టారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ అకిరా అసలు అల్లరి పిల్లవాడు కాదని అయినా పిల్లలను కొట్టడం వాళ్ళను తిట్టడం లాంటి విషయాలు తనకు నచ్చని విషయాలు అంటూ తన పిల్లల విషయాలను షేర్ చేసుకుంది రేణుదేశాయ్. 

ఇదే సందర్భంలో తన పిల్లల ఆహారపు అలవాట్ల గురించి కామెంట్ చేస్తూ వారిద్దరూ తనలాగే పూర్తిగా శాఖాహారులని మురిసిపోయింది రేణు. అయితే ఆమెతో ట్విటర్ ద్వారా సంభాషిస్తున్న ఆ అభిమాని పవన్ పిల్లల ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుని షాక్ అయి ‘రేపు మన జూనియర్ పవర్ స్టార్ తోటకూర, కొత్తిమీర తిని ఏమి పవర్ జనరేట్ చేస్తాడు?’ అన్న ప్రశ్నకు కోపగించిన రేణుదేశాయ్ సమాధానం ఇస్తూ ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచన్ హాలీవుడ్ టాప్ హీరో బ్రాడ్ పిట్ పూర్తి శాఖాహారులు కాదా? అని ప్రశ్నిస్తూ అకిరా నందన్ వారిద్దరు కంటే గొప్ప టాప్ హీరో అవుతాడు అంటూ కామెంట్ చేసింది రేణు.

అయితే ఆశ్చర్యకరంగా రేణుదేశాయ్ అకిరా పవన్ కళ్యాణ్ కన్నా గొప్ప హీరో అవుతాడు అని చెప్పకుండా తన కొడుకు భవిష్యత్ ను అమితాబ్ బ్రాడ్ పిట్ లతో పోల్చడం ఆశ్చర్యకరం. ఇదే సందర్భంలో రేణు పవన్ కళ్యాణ్ ఆహారపు అలవాట్లు గురించి మాట్లాడుతూ పవన్ కు శాఖాహారం కన్నా మాంసాహారం బాగా ఇష్టమని అయితే ఈ అలవాట్ల పై ప్రస్తుతం తాను స్పందించనని ఆ విషయాలు పవన్ వ్యక్తిగతం అంటూ కామెంట్ చేసింది. అయితే ఇప్పటి వరకు ఎన్నో సార్లు తన ట్విటర్ లో పవన్ ను పోగిదిన్ రేణు తన కొడుకు మాత్రం అమితాబ్ అంత సూపర్ స్టార్ కావాలని కోరుకోవడం వెనుక పవన్ కు ఒక ఝలక్ ఇచ్చింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: