సినీపరిశ్రమలో సెంటిమెట్లకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఓ నటి లేదా నటుడిపై ఐరన్ లెగ్ అని ముద్రపడితే అది అంత సులభంగా పోదు. కానీ శ్రుతిహాసన్ విషయంలో మాత్రం  అలా జరగలేదు. మొదట్లో ఐరన్ లెగ్ గా పేరు వచ్చినా.. ఇప్పుడు ఆమెది గోల్డెన్ లెగ్ అన్న పేరు వచ్చేసింది. వరుస విజయాలతో ఈ అమ్మడు దూసుకుపోతోంది. 

తాజాగా ఆమె నటిస్తున్న శ్రీమంతుడు త్వరలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వూల్లో ఆమె.. ఆ చిత్ర దర్శకుడిపై హాట్ హాట్ కామెంట్లు చేసింది. కొరటాల శివ సెన్సిబుల్ డైరెక్టర్ అని కితాబిచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆయన సెట్‌లో అందరితో ఈజీగా కమ్యూనికేట్ చేస్తారని అంటోంది. కామ్‌గా వుంటూనే తనకు కావాల్సింది నటుల దగ్గర నుంచి కూల్‌గా రాబట్టుకుంటారని ప్రశంసిస్తోంది. 

టోటల్ గా కొరటాల శివ స్వీటెస్ట్ టీచర్ అని ట్యాగ్ లైన్ తగిలించేసింది శ్రుతి హాసన్.. అలాగే సినిమా సెంటిమెంట్ల గురించి చెబుతూ.. గోల్డెన్ లెగ్, సిల్వర్ లెగ్ అంటూ పేర్లు పెట్టి పిలవొద్దని విజ్ఞప్తి చేసింది. అంతే కాదు.. అలా పిలవడానికి ఇది జ్యువెల్లరీ ఇండస్ట్రీ కాదు.. సినిమా ఇండస్ట్రీ..అంటూ సెటైర్లు వేస్తోంది. 

ఇటీవల మంచి జోరుమీదున్న శ్రుతిహాసన్.. ఈ ఏడాది ఎనిమిది చిత్రాల్లో నటిస్తోంది. ఆ విషయంపై స్పందిస్తూ.. కెరీర్ ప్రారంభం నుంచి ప్రతి సినిమాకు ఎలా కష్టపడుతున్నానో ఇప్పటికీ అంతే అంకితభావంతో పనిచేస్తున్నానని చెబుతోంది. దేవుడి అనుగ్రహం వల్ల తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారంటోంది. పనిలో పనిగా.. మహేష్‌బాబు చాలా అందగాడని.. కితాబిచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: