కమలహాసన్ నట వారసురాలుగా సినిమాలో రంగప్రవేశం చేసిన శ్రుతిహాసన్ వ్యక్తిత్వంలో చాల స్ట్రాంగ్ అని అంటారు. అంతేకాదు ఆమె చాల ఇండిపెండెంట్ మరియు ఇంటలిజెంట్ అని కూడా అంటూ ఉంటారు. అందుకే శ్రుతి క్రేజ్ కేవలం టాలీవుడ్ కోలీవుడ్ లకే కాదు బాలీవుడ్ కు కూడ వ్యాపించింది. చారుశీలగా మహేష్ ‘శ్రీమంతుడు’ లో సందడి చేయబోతున్న శ్రుతి ఈరోజు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ అందం పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

మహేష్ అందగాడు కాబట్టి అతడి పక్కన నటించే హీరోయిన్స్ ఎలివేట్ కారు అన్న కామెంట్స్ పై స్పందిస్తూ ‘మహేష్ ఒక్కడే అందంగా ఉంటే సరిపోతుందా? హీరో హీరోయిన్ ఇద్దరు అందంగా కనిపిస్తేనే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసి తన వ్యక్తిత్వాన్ని మరోసారి చాటుకుంది. ఇదే సందర్భంలో మహేష్ గురించి మరి కొన్ని కామెంట్స్ చేసింది శ్రుతి.

మహేష్ మంచి నటుడే కాకుండా హీరాయిన్స్ తో అతడి ప్రవర్తన చాల గౌరవప్రదంగా ఉంటుందని దీనితో అతడితో నటించే హీరోయిన్స్ కు ఎటువంటి అసౌకర్యం లేకపోవడంతో మహేష్ తో మళ్ళీమళ్ళీ నటించాలని కోరుకుంటారని కామెంట్ చేసింది శ్రుతి. అయితే మహేష్ చాలా సరదాగా జోక్స్ వేస్తాడని ఆ జోక్స్ లో ఎటువంటి ద్వందార్ధాలు ఉండకపోవడంతో సినిమాలో నటించే అందరూ మహేష్ జోక్స్ ను ఎంజాయ్ చేస్తూ అప్పుడే షూటింగ్ అయిపోయిందా అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు అంటూ మహేష్ ను తెగ పొగిడింది శ్రుతి.

ప్రస్తుతం తాను నటిస్తున్న చాల సినిమాలు విజయవంతం అవుతున్నాయి కాబట్టి తనను గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పోలుస్తూ కామెంట్స్ చేస్తున్న విషయం పై స్పందిస్తూ గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్ అనుకోవడానికి తన శరీరం ఏమైనా జ్యూవెలరీ షాపుగా కనిపిస్తోందా అంటూ సెటైర్లు వేసింది శ్రుతిహాసన్. ‘శ్రీమంతుడు’ లో తాను చేస్తున్న చారుశీల పాత్ర అందరికీ నచ్చడమే కాకుండా ‘శ్రీమంతుడు’ ఘన విజయానికి తన పాత్ర కూడ సహకరిస్తుంది అని అంటూ తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను మరొక సారి చాటుకుంది శ్రుతి..  



మరింత సమాచారం తెలుసుకోండి: