యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘తిక్క’ సినిమా ప్రారంభం సందర్భంగా అక్కడకు వచ్చిన కొంతమంది అతిధులు సాయి ధరమ్ తేజ్ అత్యుత్సాహంతో పరుగులు తీస్తూ తన కెరియర్ పై తానే ప్రయోగాలు చేసుకుంటూ ప్రమాదంలో పడబోతున్నాడా? అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు సాయి ధరమ్ తేజ్ ఇదే స్పీడ్ ను కొనసాగిస్తే గతంలో యంగ్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదట్లో విజయాలను చూసి ఆ తరువాత పరాజయాలకు చిరునామాగా మారిపోయిన వరుణ్ సందేశ్ కెరియర్ అడుగుజాడల్లో సాయి ధరయ్ తేజ్ ఫాలో అయినట్లుగా పరిస్థితి మారిపోతుందని కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. 

అయితే ఇటువంటి కామెంట్స్ సాయి ధరమ్ తేజ్ పై రావడానికి ఒక కారణం ఉంది. ఈ యంగ్ మెగా హీరో నటించిన రెండు సినిమాలలో ఒక సినిమా ఒక మాదిరి హిట్ గా మిగిలితే మరొక సినిమా భయంకరమైన ఫ్లాప్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ యంగ్ హీరో నటిస్తున్న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ నిర్మాణంలో ఉంది. ఈ సినిమా విడుదల తరువాత కాని ఈ యంగ్ హీరో కెరియర్ పై క్లారిటీ రాదు.

కానీ ఇలాంటి విషయాలు ఏమి పట్టించుకోకుండా వరస పెట్టి సినిమాలు చేస్తూ వచ్చిన ప్రతి అవకశాన్ని ఒప్పుకుంటూ సినిమాలు చేస్తే అనుకోకుండా వరస ఫ్లాపులుగా సినిమాలు మారితే వరుణ్ సందేశ్ కెరియర్ కు వచ్చిన నెగిటివ్ ప్రభావమే సాయి ధరమ్ తేజ్ కు కూడ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ యంగ్ మెగా హీరో కొద్దిగా దూకుడు తగ్గిస్తే బాగుటుంది అంటూ నిన్న జరిగిన ‘తిక్క’ సినిమా షూటింగ్ ప్రారంభంలో కొందరు కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. ఈ వార్తలలో ఎన్ని వాస్తవాలో తెలియక పోయినా సాయి ధరమ్ తేజ్ దూకుడు మాత్రం చాల స్పీడ్ లో ఉంది అన్నది వాస్తవం..


మరింత సమాచారం తెలుసుకోండి: