ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా హంగామా చేస్తుంది. ఇప్పటికే 350 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టినట్లు సమాచారం. తెలుగు ఇండస్ట్రీలో మునుపెన్నడు రాని సంచలనాలు ఈ సినిమా ద్వారా వచ్చాయి. అసలు తెలుగు వారు ఈ రేంజ్ లో సినిమాలు తీయగలరా అన్న వారికి చెంపపెట్టుగా మారింది. ఇప్పటి వరకు రెండు వందల కోట్ల కలెక్షన్స్ బాలీవుడ్, కోలీవుడ్ లో నే ఉండేది అదే పెద్ద రికార్డుగా భావించే వారు ఇప్పుడు మూడు కాదు నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టే బాటలో ‘బాహుబలి’ ఉంది.

ఇకపోతే రాజమౌళి తన సినిమాల్లో ఎప్పుడూ ఏదో ఒక క్రియెటివిటీ ఆలోచిస్తాడు.. బాహుబలి చిత్రంలో ఒక భాషనే కనిపెట్టాడు కిల్ కిల్ భాష మునుపెన్నడు ఇలాంటి ప్రయోగాలు ఎవరూ చేయలేదు. అంతేకాదు డైలాగుల్లేని చిన్నా చితకా వేషాలు వేసి ‘మర్యాద రామన్న’ చిత్రంలో చేసిన బైర్రెడ్డి క్యారెక్టర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రభాకర్‌ లేటెస్ట్‌గా ‘బాహుబలి’లో చేసిన కాళకేయుడి క్యారెక్టర్‌తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. టి.వి. ఛానల్స్‌ పోటీపడి మరీ అతని ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి. ఈ ఘనత తనది కాదని రాజమౌళి తనకు దేవుడి లాంటి వారని ప్రభాకర్ ప్రతి ఇంటర్వూలో చెబుతున్నాడు.

బాహుబలి లో కాళకేయుడిగా ప్రభాకర్


ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేను’ అంటూ ఎంతో వినయంగా చెప్తున్న ప్రభాకర్‌ ‘బాహుబలి2’లో కూడా తన క్యారెక్టర్‌ వుందంటున్నాడు.  అయితే ‘బాహుబలి-2’ లో మళ్ళీ నా పాత్ర ఉందని చెబుతున్నాడు.మొదటి భాగంలో చనిపోయిన కాళికేయుడు రెండ భాగంలో ఎలా ఉంటాడాన్ని ప్రశ్నిస్తే..? దానిని మీరు తెరపై చూస్తే తెలుస్తుందని రాజమౌళిని మించేలా షాక్ ఇస్తున్నాడు మన ప్రభాకర్. చూడాలి మరీ కాళికేయుడి మాటల్లో ఏంత నిజం ఉందో….!



మరింత సమాచారం తెలుసుకోండి: