బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో,దర్శకులు మధ్య గొడవలు సర్వసాధారణంగా ఉంటాయి. అయితే తాజాగా ప్రభుదేవాత తీసుకున్న నిర్ణయానికి స్టార్ హీరో సల్మాన్ రియాక్ట్ అయ్యాడు. అంతటితో ఆగకుండా, ప్రభుదేవాకి వార్నింగ్ సైతం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, చాలాకాలంగా ప్రభుదేవా దర్శకత్వం నుండి బిటౌన్ లో నిర్మాతగా రాణించాలనుకుంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అవి ఎట్టకేలకు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఇక నుండి ప్రభుదేవా, తన పేరు మీదే ప్రభుదేవా స్టూడియోస్‌ బ్యానర్‌ తో సినిమాలు నిర్మించబోతున్నారు. అత్యుత్తమ నాణ్యతతో సినిమాలు రూపొందించే లక్ష్యంతో ప్రభుదేవా స్టూడియోస్‌ని స్థాపించానని,ప్రతిభావంతులైన కళాకారులకు అవకాశాలిస్తానని ప్రభుదేవా తెలిపారు. అన్ని భాషల్లోను సినిమాలు నిర్మించే యోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు.

గతంలో ప్రభుదేవా తను నిర్మాతగా మారాతాను అని అన్నప్పుడు, సల్మాన్ వెంటనే రియాక్ట్ అయ్యాడంట. ప్రభుదేవా నిర్మాతగా మారితే, మొదటి సినిమాకు హీరో సల్మాన్ ఖాన్ అయి ఉండాలి. అలా జరగలేదంటే ఇక ప్రభుదేవా బ్యానర్ లో సల్మాన్ కనిపించడు.

ఇది ప్రభుదేవాకి సల్మాన్ ఖాన్ మొదటి వార్నింగ్ అంటూ ఆ మధ్య బిటౌన్ లో హాట్ టాపిక్స్ గా వినిపించాయి. అయితే, సల్మాన్ ఖాన్ వార్నింగ్ ని ప్రభుదేవా పక్కన పెట్టేశాడనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే ప్రభుదేవాపై సల్మాన్ తిరిగి కౌంటర్ వేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: